మళ్లీ తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్

  • Published By: veegamteam ,Published On : October 4, 2019 / 09:53 AM IST
మళ్లీ తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్

Updated On : October 4, 2019 / 9:53 AM IST

టాలీవుడ్ హీరోయిన్ స్నేహా ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో వరుస హిట్లతో దూసుకుపోయింది. 2012 లో తన సహ నటుడు ప్రసన్నని ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీంతో కొన్నాళ్ళు సినిమా పరిశ్రమకి దూరంగా ఉండిపోయింది. తర్వాత వాళ్లిద్దరికి ఓ బాబు పుట్టాడు. అతని పేరు విహాన్.  

అయితే కొన్నేళ్ల క్రితం పెద్ద కుమారుడు నిహస్ కి జన్మనిచ్చిన దంపతులు ఇప్పుడు మరో బిడ్డకు స్వాగతం పలుకబోతున్నారు. ఆమె సీమంతం చెన్నైలో బంధు, మిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్నేహా తన సీమంతం ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. 

స్నేహ చివ‌రిగా రామ్ చ‌ర‌ణ్ న‌టించిన విన‌య విధేయ రామ చిత్రంతో పాటు త‌మిళంలో శివ‌కార్తికేయ‌న్ హీరోగా తెర‌కెక్కిన‌ వెలైక్కార‌న్ అనే సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది. ఇక ఆమె న‌టించిన ప‌ట్టాస్, వాన్ చిత్రాలు త్వర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.