actress Sravani : ఆత్మహత్యకు దేవ్ రాజ్ కారణం – శ్రావణి తల్లి

Television Actress Sravani Kondapalli : తెలుగు సీరియల్ నటి శ్రావణి..ఆత్మహత్యకు కారణం దేవ్ రాజ్ అంటూ మరోసారి చెప్పింది ఆమె తల్లి. దేవ్ రాజ్..వెధవ..రాకపోతే..బ్రహ్మాండంగా నా కూతురు సీరియళ్లు చేసకుంటూ ఉండేది..కొంపలోకి అడుగుపెట్టి..ప్రాణాలు తీశాడని చెప్పింది. 10tvతో ఆమె మాట్లాడింది.
ఈ సందర్భంగా తాను తప్పు చేయలేదని వాదిస్తున్న దేవ్ రాజ్ పై ఆరోపణలు చేశారు. వాడికి మేలు చేసి ఒక దారి చూపించిందన్నారు. ప్రాణాలు తీయడం ఎంతవరకు న్యాయం ? శిక్ష పడవద్దా అని ప్రశ్నించారు. సీరియల్స్ చేస్తూ..వేరే అమ్మాయిని ఇదే విధంగా చేస్తాడని, అందుకే శిక్ష పడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
దేవ్ రాజ్ ను ఇంట్లో పెట్టుకున్నందుకు పిచ్చెక్కిస్తున్నాడు, నేను బతకలేను అని శ్రావణి పేర్కొంటూ బాధతో కేసు పెట్టామన్నారు. కేసు కొట్టి వేయడం కోసం…దొంగనాటకాలు ఆడారని, నమ్మించి ప్రాణాలు తీశాడన్నారు. అమ్మాయి అతడిని ప్రేమించిందని, కానీ మోసం చేశాడన్నారు.
కూతురు ముఖ్యమా ? బయటి వ్యక్తి ముఖ్యమా చెప్పండి అని ప్రశ్నించారు. అమ్మ, నాన్న చచ్చిపోయేలా ఉన్నారు..రమ్మని సాయి చెప్పాడని తెలిపింది.
ట్రయాంగిల్ లవ్ స్టోరీనే శ్రావణి ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. మూడు రోజులుగా సాగుతున్న ఈ కేసు దర్యాప్తులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. మొదట దేవరాజ్ చుట్టూ కేస్ తిరిగితే.. ముచ్చటగా మూడో రోజు సాయి వైపు మళ్లింది. పోలీసుల ఎదుట లొంగిపోయిన దేవరాజ్ ఈ కేసులో పోలీసులకు కీలకమైన సాక్ష్యాలు అందించాడు.