Adah Sharma : ప్రమోషన్‌లో అస్వస్థతకు గురైన అదా శర్మ.. వెంటనే హాస్పిటల్‌కి తరలింపు..

ది కేర‌ళ స్టోరీతో సూపర్ స్టార్‌డమ్ ని సంపాదించుకున్న అదా శర్మ.. ఇప్పుడు 'కమాండో' అనే స్పై యాక్షన్ సిరీస్ తో రాబోతుంది. ఇక ఈ ప్రమోషన్ లో ఉన్న అదా..

Adah Sharma : ప్రమోషన్‌లో అస్వస్థతకు గురైన అదా శర్మ.. వెంటనే హాస్పిటల్‌కి తరలింపు..

Adah Sharma fell ill during Commando webseries promotion

Updated On : August 2, 2023 / 5:58 PM IST

Adah Sharma : హీరోయిన్ అదా శ‌ర్మ(Adah Sharma).. ఇటీవల ది కేర‌ళ స్టోరీ (The Kerala Story) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని బిగ్ స్టార్‌డమ్ ని సంపాదించుకుంది. ఈ మూవీతో వచ్చిన ఫేమ్ తో బాలీవుడ్ లో తెగ సందడి చేస్తుంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ ‘కమాండో’ (Commando) అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ ఆగష్టు 11న రిలీజ్ కాబోతుంది. దీంతో అదా వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటూ వస్తుంది. ఈ క్రమంలోనే తను తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది.

Extra Ordinary Man : శ్రీలీలతో నితిన్ డ్యూయెట్ సాంగ్ అదిరిపోయింది.. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ఫస్ట్ సాంగ్ రిలీజ్..

డయేరియా మరియు తీవ్రమైన ఫుడ్ ఎలర్జీకి గురి కావడంతో తనని వెంటనే హాస్పిటల్ కి తరలించారు. ఈ విషయాన్ని ఆమె స్నేహితులు మీడియాకి ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రస్తుతం అదా డాక్టర్స్ పర్యవేక్షణలోనే చికిత్స తీసుకుంటూ వస్తుంది. ఇక అదా పరిస్థితి తెలుసుకున్న అభిమానులు.. ఆమె త్వరగా కోలుకొని రావాలంటూ సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు. ఇక ‘కమాండో’ సిరీస్ విషయానికి వస్తే.. విద్యుత్ జమ్వాల్ (Vidyut Jammwal) హీరోగా గతంలో కమాండో 1,2&3 సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి.

Tharun : పెళ్లి ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన తరుణ్.. నేనే చెప్తారా బాబు చేసుకుంటే..

ఆ సినిమాలు తెరకెక్కించిన మేకర్స్.. ఇప్పుడు ఈ సిరీస్ ని డిస్నీ+ హాట్‌స్టార్‌ ఒరిజినల్ కంటెంట్ గా తెరకెక్కిస్తున్నారు. కమాండో 3 మూవీలో అదా శ‌ర్మ ప్రధాన పాత్రలో నటించింది. ఇప్పుడు ఈ సిరీస్ లో కూడా అదా మెయిన్ లీడ్ చేస్తుండడంతో.. ఆ మూవీ సిరీస్ కి, ఈ వెబ్ సిరీస్ కి ఏమన్నా కనెక్షన్ ఉండబోతుందా అని అందరిలో ఆసక్తి నెలకుంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ లోని యాక్షన్ అండ్ విజువల్స్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. అదా కూడా యాక్షన్ సీన్స్ తో అదరగొడుతుంది. ఒకసారి మేరకు కూడా చూసేయండి ఆ ట్రైలర్.