Om Raut: ఆదిపురుష్ సినిమా విడుద‌ల‌.. ద‌ర్శ‌కుడు ఓం రౌత్ పై నెటిజన్ల దారుణమైన ట్రోలింగ్

రాముడిగా ప్ర‌భాస్‌(Prabhas), సీత‌గా కృతి స‌న‌న్(Kriti Sanon) న‌టించిన సినిమా ఆదిపురుష్‌(Adipurush). ఓం రౌత్(Om Raut) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో నేడు(జూన్ 16)న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

Om Raut: ఆదిపురుష్ సినిమా విడుద‌ల‌.. ద‌ర్శ‌కుడు ఓం రౌత్ పై నెటిజన్ల దారుణమైన ట్రోలింగ్

Adipurush Director Om Raut

Updated On : June 16, 2023 / 5:53 PM IST

Om Raut-Adipurush : రాముడిగా ప్ర‌భాస్‌(Prabhas), సీత‌గా కృతి స‌న‌న్(Kriti Sanon) న‌టించిన సినిమా ఆదిపురుష్‌(Adipurush). ఓం రౌత్(Om Raut) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో నేడు(జూన్ 16)న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా ఎలా ఉంద‌నే విష‌యాన్ని కాసేపు ప‌క్క‌న పెడితే ఇప్పుడు అంద‌రూ ద‌ర్శ‌కుడు ఓం రౌత్‌ను ట్రోలింగ్ చేస్తున్నారు.

సినిమా బాగా లేద‌ని, ఓం రౌత్ చెడ‌గొట్టాడ‌ని అంటున్నారు. సౌండ్ ఎఫెక్ట్స్ బాగానే ఉన్నా విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఆక‌ట్టుకోవ‌డం లేద‌ని చెబుతున్నారు. పెద్ద తారాగ‌ణం, భారీ బ‌డ్జెట్ చేతిలో ఉన్నా స‌రిగ్గా ఉప‌యోగించుకోలేక‌పోయాడ‌ని విమ‌ర్శిస్తున్నారు. డైరెక్టర్ ఓం రౌత్ ను విమర్శిస్తూ ట్విటర్ లో ఫొటోలు, వీడియాలు షేర్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.