Aditi Rao Hydari : హీరోల దగ్గరికి వెళ్లి అలా చెప్పగలరా? మా దగ్గరికి వచ్చి మాత్రం.. అదితిరావు హైదరీ వ్యాఖ్యలు వైరల్..
తాజాగా బాలీవుడ్ లోని ఓ ప్రముఖ సినీ మీడియా సినీ పరిశ్రమలోని పలువురు మహిళా ప్రముఖుల్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేశారు. ఈ నేపథ్యంలో సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలని మాట్లాడారు.

Aditi Rao Hydari Sensational Comments on Lady Oriented Films
Aditi Rao Hydari : గత కొన్ని నెలలుగా నటుడు సిద్ధార్థతో(Siddharth) డేటింగ్ చేస్తుందంటూ అదితిరావు హైదరీ వార్తల్లో నిలుస్తుంది. మలయాళంలో ప్రజాపతి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అదితి ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయింది. సమ్మోహనం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హైదరాబాద్ అమ్మాయి ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలు కూడా చేసింది. ప్రస్తుతం బాలీవుడ్(Bollywood) లోనే పలు సినిమాలు, సిరీస్ లు చేస్తుంది అదితి.
ఇక సిద్ధార్థతో చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తూ అతనితో లైఫ్ ఎంజాయ్ చేస్తుంది అదితిరావు హైదరీ. తాజాగా బాలీవుడ్ లోని ఓ ప్రముఖ సినీ మీడియా సినీ పరిశ్రమలోని పలువురు మహిళా ప్రముఖుల్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేశారు. ఈ నేపథ్యంలో సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలని మాట్లాడారు. ఈ నేపథ్యంలో యాంకర్.. ఒక యాక్టర్ గా మీరు ఏం వినకూడదు అనుకుంటున్నారు అని అడిగారు.
దీనికి అదితిరావు హైదరీ సమాధానమిస్తూ.. ఎవరైనా వచ్చి ఇది హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం అని చెప్పడం వినకూడదు అనుకుంటున్నాను. ఎవరూ కూడా హీరోల దగ్గరికి వెళ్లి ఇది హీరో సెంట్రిక్ ఫిలిం అని చెప్పారు. మన కథ చెప్తాము అంతే. అందరూ కథలు చెప్పడానికే ఇక్కడ ఉన్నారు. కానీ మహిళా నటుల దగ్గరకు వచ్చి మాత్రం ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా అని కథ చెప్తారు ఆ మాట వినకూడదు అనుకుంటాను అని తెలిపింది. దీంతో అదితి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.