Vijay Rashmika : బాలయ్య షోలో విజయ్ దేవరకొండ రష్మిక రిలేషన్ గురించి.. విజయ్‌కి కాల్ చేయగానే సిగ్గుపడిన రష్మిక..

అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ 3 రెండో ఎపిసోడ్ షూట్ ఇటీవలే జరగగా యానిమల్(Animal) సినిమా టీం నుంచి సందీప్ వంగ, రణబీర్ కపూర్, రష్మిక మందన్నా(Rashmika Mandanna) వచ్చి సందడి చేశారు.

Vijay Rashmika : బాలయ్య షోలో విజయ్ దేవరకొండ రష్మిక రిలేషన్ గురించి.. విజయ్‌కి కాల్ చేయగానే సిగ్గుపడిన రష్మిక..

Balakrishna Reminds Vijay Devarakonda at Rashmika Mandanna in Unstoppable with NBK Show

Updated On : November 18, 2023 / 3:00 PM IST

Vijay Rashmika : అన్‌స్టాపబుల్ విత్ NBK ఇటీవల సీజన్ 3 మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. దసరా కానుకగా అన్‌స్టాపబుల్(Unstoppable with NBK) సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్ లో భగవంత్ కేసరి టీం కాజల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, అనిల్ రావిపూడి వచ్చి సందడి చేశారు. ఇప్పుడు రెండో ఎపిసోడ్ రానుంది. అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ 3 రెండో ఎపిసోడ్ షూట్ ఇటీవలే జరగగా యానిమల్(Animal) సినిమా టీం నుంచి సందీప్ వంగ, రణబీర్ కపూర్, రష్మిక మందన్నా(Rashmika Mandanna) వచ్చి సందడి చేశారు.

తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమోలో బాలయ్య యానిమల్ టీంతో కలిసి రచ్చ చేశారు. రణబీర్(Ranbir Kapoor), రష్మిక లతో కలిసి డ్యాన్సులు వేశారు. సరదా ప్రశ్నలు అడిగారు. ప్రోమో అంతా ఫుల్ ఫన్ గా సరదాగా సాగిపోయింది. అయితే ఈ ప్రోమోలో రష్మికతో విజయ్ దేవరకొండ గురించి టాపిక్ తీసుకువచ్చారు బాలయ్య. విజయ్ కి రష్మికతో కాల్ చేయించారు. విజయ్ కాల్ లిఫ్ట్ చేయగానే.. వాట్సాప్ రే అంటూ క్యూట్ గా అన్నాడు. దీంతో అక్కడ షోలో ఉన్న ఆడియన్స్ అరవగా రష్మిక సిగ్గుపడింది. ఆ తర్వాత సందీప్ వంగ విజయ్ తో మాట్లాడుతుంటే.. మీ హీరోకి చెప్పు ఐ లవ్ రష్మిక అని అన్నారు బాలయ్య. అలాగే.. రష్మిక మాట్లాడుతుంటే.. మేడ మీద పార్టీలు ఏంటన్నా అని బాలయ్య విజయ్ దేవరకొండని అడిగాడు. దీంతో మరోసారి రష్మిక సిగ్గుపడుతూ నవ్వేసింది.

రష్మిక, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఎప్పట్నుంచో ప్రేమలో ఉన్నారు, డేటింగ్ చేస్తున్నారు అనే వార్తలు వస్తూనే ఉన్నాయి. మధ్యలో ఓ సారి మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఆ వార్తలు కొట్టేసినా, ఇద్దరూ కలిసి ట్రిప్స్ కి వెళ్లడం, రష్మిక విజయ్ ఇంట్లో పండగలు సెలబ్రేట్ చేసుకోవడం, విజయ్ ఇంట్లో రష్మిక ఫొటోలు దిగి పోస్ట్ చేయడంతో వీళ్ళ రిలేషన్ మీద రోజూ వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు అన్‌స్టాపబుల్ షోలో బాలయ్య కూడా అడగడం, విజయ్ మాట్లాడగానే రష్మిక సిగ్గుపడటంతో నిజంగానే వీరిద్దరి మధ్య ఏమన్నా ఉందా, ఉంటే చెప్పేయొచ్చు కదా అని అంటున్నారు అభిమానులు. దీంతో మరోసారి విజయ్ – రష్మిక వైరల్ గా మారారు.

Also Read : Allu Arjun : వరుణ్ పెళ్లి నుంచి అల్లు అర్జున్ ఫ్యామిలీ క్యూట్ పిక్స్ చూశారా? బన్నీ కూతుర్ని ఎత్తుకొని.. అయాన్ ఎక్కడ?

ఇక ప్రోమోలోనే ఈ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఉందంటే ఎపిసోడ్ ఇంకే రేంజ్ లో ఉంటుందో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ నవంబర్ 24న ఆహాలో ప్రీమియర్ అవ్వనుంది. యానిమల్ సినిమా నుంచి ఇప్పటికే సాంగ్స్, టీజర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ డిసెంబర్ 1న రిలీజ్ కాబోతుంది.