Allu Arjun : వరుణ్ పెళ్లి నుంచి అల్లు అర్జున్ ఫ్యామిలీ క్యూట్ పిక్స్ చూశారా? బన్నీ కూతుర్ని ఎత్తుకొని.. అయాన్ ఎక్కడ?
ఇప్పటికే వీరి ఫోటోలు కొన్ని రాగా తాజాగా స్నేహ రెడ్డి మరి కొన్ని క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Allu Sneha Reddy shares Cute Family Photos from Varun Lavanya Marriage
Allu Arjun : ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)ని ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్ళికి మెగా ఫ్యామిలీ అంతా వెళ్లి సందడి చేశారు. ఇప్పటికే వరుణ్ లావణ్య పెళ్లి ఫొటోలు చాలా బయటకి రాగా అవి వైరల్ అయ్యాయి. ఈ పెళ్ళికి అల్లు ఫ్యామిలీ కూడా అందరూ కలిసి వెళ్లారు. పెళ్ళిలో అల్లు అర్జున్, తన భార్య స్నేహ, పిల్లలు అర్హ, అయాన్ కూడా ఎంజాయ్ చేశారు.
ఇప్పటికే వీరి ఫోటోలు కొన్ని రాగా తాజాగా స్నేహ రెడ్డి మరి కొన్ని క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో అల్లు అర్జున్, స్నేహ రెడ్డి జంట చూడముచ్చటగా ఉన్నారు. అలాగే బన్నీ అర్హని ఎత్తుకున్న ఓ క్యూట్ ఫోటో కూడా పోస్ట్ చేశారు. అర్హ.. చరణ్ కుక్క రైమ్ తో ఆడుకుంటున్న మరో క్యూట్ ఫోటో కూడా పోస్ట్ చేసింది స్నేహ. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
Also Read : Karthika Nair : కాబోయే భర్తను పరిచయం చేస్తూ ఫోటోలు షేర్ చేసిన నటి
దీంతో క్యూట్ ఫోటోలు అంటూ, సూపర్ జంట అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఫొటోల్లో అయాన్ లేకపోవడంతో అల్లు అయాన్ ఎక్కడ అని కూడా అడుగుతున్నారు నెటిజన్లు.
View this post on Instagram