Aditya Dhar: అలా అయితే సినిమాలు చేయడం ఆపేస్తాను.. ధురంధర్ దర్శకుడి షాకింగ్ కామెంట్స్
ధురంధర్ 2పై వస్తున్న నెగిటీవ్ కామెంట్స్ పై సాలిడ్ కౌంటర్ ఇచ్చిన దర్శకుడు ఆదిత్య ధర్(Aditya Dhar).
Aditya Dhar solid counter to negative comments about Dhurandhar 2
- ధురంధర్ 2 సినిమాపై నెగిటీవ్ కామెంట్స్
- ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన దర్శకుడు
- సినిమాలు ఆపేస్తాను అంటూ షాకింగ్ కామెంట్స్
Aditya Dhar: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ధురంధర్ 2’ పేరు మారుమోగిపోతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీని సృష్టిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి, సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే, ఈ స్థాయి విజయం వెనుక కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
Akanksha Singh: ఆకాంక్ష సింగ్ అందాల విందు.. పింక్ డ్రెస్సులో పరువాలు కేక.. ఫొటోలు
ఈ చిత్రం ఒక సెపరేట్ అజెండాతో తీసిన ‘ప్రాపగాండా’ సినిమా అంటూ సోషల్ మీడియాలో కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్(Aditya Dhar) తాజాగా స్పందిస్తూ విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. తమ సినిమాను ప్రాపగాండా అని పిలిచే వారి గురించి తాను అస్సలు పట్టించుకోనని ఆదిత్య ధర్ స్పష్టం చేశారు. “ఎవరైనా ఏదైనా అనవచ్చు, కానీ వాటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. భారతీయ ప్రేక్షకులు చాలా తెలివైన వారు. ఏది మంచి సినిమా, ఏది ప్రచార చిత్రం అనేది వారికి స్పష్టంగా తెలుసు. అందుకే వారు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.
కేవలం సినిమా రికార్డుల కోసమో, వివాదాల కోసమో కాకుండా, ఒక సరైన ఉద్దేశంతోనే ఈ కథను తెరకెక్కించాను. దర్శకుడిగా నా బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తించానని, ఒకవేళ నా ఆలోచనల్లో గానీ, సినిమా తీసే పద్ధతిలో గానీ తప్పుడు ఉద్దేశం ఉందని భావిస్తే, ఆ రోజే నేను సినిమాలు చేయడం ఆపేస్తాను” అంటూ ఆదిత్య ధర సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
