Aditya Om : హీరోకి చేతులు కట్టేసి.. సక్సెస్ ఈవెంట్లో కొత్తగా..
బందీ సినిమా ఇటీవల ఫిబ్రవరి 28న థియేటర్స్ లో రిలీజవ్వగా తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు.

Aditya Om Bandi Movie Success Meet Hero hands tied in event
Aditya Om : గతంలో హీరోగా నటించి మెప్పించిన ఆదిత్య ఓం ఇటీవలే మళ్ళీ హీరోగా ‘బందీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా అంతా ఆదిత్య ఓం ఒక్క పాత్రతోనే గల్లీ సినిమా బ్యానర్ పై వెంకటేశ్వర రావు దగ్గు, తిరుమల రఘు నిర్మాణంలో తిరుమల రఘు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. బందీ సినిమా ఇటీవల ఫిబ్రవరి 28న థియేటర్స్ లో రిలీజవ్వగా తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు.
Also Read : Court Trailer : నాని నిర్మాతగా.. ‘కోర్ట్’ సినిమా ట్రైలర్ రిలీజ్..
అయితే ఈ సక్సెస్ ఈవెంట్ కి టైటిల్ కి తగ్గట్టు హీరో చేతుల్ని తాళ్లతో బంధీగా కట్టేసి సరికొత్తగా తీసుకొచ్చారు. దీంతో ఈ ఈవెంట్ ఫొటోలు వైరల్ గా మారాయి. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో తీసిన ఈ సినిమా ఆకట్టుకుంది. ఆదిత్య ఓం యూపీ నుంచి ఇక్కడకు వచ్చి తన ప్యాషన్‌తో సినిమాలు చేస్తున్నారు. డైరెక్టర్ రఘు తిరుమల మంచి పాయింట్‌తో సినిమా అని అన్నారు.
దర్శకుడు రఘు తిరుమల మాట్లాడుతూ.. ఆదిత్య ఓం గారు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. ఆయన సహకారంతోనే ఈ సినిమాని తీసాం. ఈ సినిమాలో మ్యూజిక్, విజువల్స్ గురించి అందరూ ప్రశంసిస్తున్నారు అని అన్నారు. హీరో ఆదిత్య ఓం మాట్లాడుతూ.. ప్రస్తుతం పర్యావరణ అసమతుల్యత వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. మంచి మెసేజ్ ఇచ్చే బందీని ఇంత బాగా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్. మున్ముందు మరిన్ని మంచి సినిమాలతో ఆడియన్స్ ని మెప్పిస్తాను అని అన్నారు.