దూరదర్శన్ డబుల్ ధమాకా – షారుక్ ‘సర్కస్’, రజిత్ ‘బ్యోమకేశ్ బక్షీ’ పునః ప్రసారం..

  • Published By: veegamteam ,Published On : March 28, 2020 / 12:18 PM IST
దూరదర్శన్ డబుల్ ధమాకా – షారుక్ ‘సర్కస్’, రజిత్ ‘బ్యోమకేశ్ బక్షీ’ పునః ప్రసారం..

Updated On : March 28, 2020 / 12:18 PM IST

కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. ఈ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దాంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితయ్యేలా దూరదర్శన్ ఇప్పటికే రామాయణం, మహాభారతం సీరియళ్లను మళ్లీ ప్రసారం చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా పబ్లిక్ డిమాండ్ పెరగటంతో  మరో రెండు పాత షోలను పునః ప్రసారం చేయాలని నిర్ణయించుకుంది.

షారుక్ ఖాన్ కెరీయర్ తొలినాళ్లల్లో 1989 లో నటించిన టీవీ సిరీస్ ‘సర్కస్’, 1993లో రజిత్ కపూర్ బయోడిటెక్టివ్ షో ‘బ్యోమకేశ్ బక్షి’లను శనివారం(మార్చి28, 2020) నుంచి ప్రసారం చేయనున్నట్లు దూరదర్శన్ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపింది.  స‌ర్క‌స్‌ను రాత్రి 8 గంట‌ల‌కు,  బ్యోమ‌కేశ్ బ‌క్షి ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రసారం చేయ‌నున్న‌ట్లు వెల్లడించింది.

స‌ర్క‌స్‌లో షారుక్ శేఖ‌ర‌న్ పాత్ర చేశాడు. ఈ పాత్ర అత‌నికి మంచి పేరు వ‌చ్చింది.  విక్కీ అజీజ్ మీర్జా, కుందన్ షా దర్శకత్వం వహించారు. రేణుకా షాహనే, పవన్ మల్హోత్రా, అశుతోష్ గోవారికర్ తదితర పాత్రల్లో న‌టించారు. 1989లో ఫౌజీ, సర్కస్ తో సీరియల్ నటుడిగా రంగప్రవేశం చేసిన షారుక్ ఖాన్ 1992 లో దీవానా చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 1989, 1990లో మొద‌ట ప్ర‌సారం చేసిన‌ స‌ర్క‌స్ మ‌ళ్లీ ప్ర‌జ‌ల డిమాండ్ మేరకు 2017,2018 లో కూడా ప్ర‌సారం చేశారు. ర‌జిత్ క‌పూర్ షో బ్యోమ‌కేశ్ బ‌క్షి మొద‌ట 1993 నుంచి 1997 దాదాపు నాలుగు సంవ‌త్స‌రాల పాటు కొన‌సాగింది.