Rana Daggubati : ఆ పని చేసినందుకు నాన్నతో గొడవ.. ఇద్దరం మాట్లాడుకోవడం మానేశాం..

రానా అమ్మేసిన ఒక కంపెనీ ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద కంపెనీగా మారింది. ఇది అమ్మేసినందుకు సురేష్ బాబు రానాతో మాట్లాడడం మానేశారట.

Rana Daggubati : ఆ పని చేసినందుకు నాన్నతో గొడవ.. ఇద్దరం మాట్లాడుకోవడం మానేశాం..

After Rana Daggubati sold his Spirit Media VFX company Suresh Babu didnt talk to his son

Updated On : November 8, 2023 / 3:02 PM IST

Rana Daggubati : టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీకి మోస్ట్ వాంటెడ్ పర్సన్ అయ్యపోయాడు. హీరోగా, విలన్‌గా చేస్తూనే నిర్మాతగా, టాలీవుడ్ ఎదుగుదల కోరుకునే వ్యక్తిగా సినిమా రంగానికి ఏ విధంగా సేవలు కావాలో ఆ విధంగా అందిస్తూ వస్తున్నాడు. ‘లీడర్’ సినిమాతో నటుడిగా ప్రయాణం మొదలుపెట్టిన రానా.. అంతకుముందు ఒక VFX స్టూడియోని నడిపేవాడు. అయితే ఈ కంపెనీని కొన్ని కారణాలు వల్ల అమ్మేయాల్సి వచ్చింది. ఆ టైములో జరిగిన కొన్ని విషయాలను రానా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.

18 సంవత్సరాల క్రితం రానా ‘స్పిరిట్ మీడియా’ అనే విజువల్ ఎఫెక్ట్స్ సంస్థని ప్రారంభించాడు. ఐదేళ్లు పాటు ఆ కంపెనీని నడుపుకుంటూ వచ్చాడు. బాహుబలి వంటి గ్రాఫికల్ వండర్ సినిమాలను ఆ సంస్థలో తెరకెక్కించాలని అనుకున్నాడు. కానీ ఆ సమయంలో అలాంటి చిత్రాలు తీసే సాహసం ఎవరు చేయలేదు. నాలుగేళ్లు ఈ కంపెనీని ఎలాగోలా నడిపిన రానా.. ఐదో ఏట తన వల్ల కాక అమ్మేశాడు. అది తాను సరదాగా చేసే వ్యాపారం కాదని భావించిన రానా ప్రైమ్ ఫోకస్ కు అమ్మేశాడు. ఇప్పుడు అది ప్రపంచంలోనే పెద్ద విజువల్ ఎఫెక్ట్ కంపెనీగా మారింది.

Also read : Samantha : సమంత ఆయుర్వేదం చికిత్స.. ఏ దేశంలో తీసుకుంటుందో తెలుసా?

రానా ఈ కంపెనీ నడుపుతున్న సమయంలో ‘బొమ్మలాట’ అనే సినిమా నిర్మించాడు. దానికి రెండు నేషనల్ అవార్డులు వచ్చాయి. కానీ థియేటర్ లో మాత్రం రిలీజ్ కాలేదు. ఇక ఈ కంపెనీని అమ్మేయడంతో రానా ఇంటిలో నెల రోజులు పాటు గొడవలు జరిగాయి. రానా తండ్రి సురేష్ బాబు.. రానాతో కొన్నిరోజులు మాట్లాడడం మానేశారట. అయితే ఆ సమయంలో తనకి ఆ కంపెనీని అమ్మడం తప్ప మరో మార్గం లేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.