3 Years for Aha : తెలుగు, తమిళ్.. ఆహా నెక్స్ట్ టార్గెట్ ఇండియా?

తెలుగు నెంబర్ వన్ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ఆహా మూడవ వార్షికోత్సవం పూర్తి చేసుకొంది. దీంతో ఆహా టీం తమకి ఇంతటి సక్సెస్ ని అందించి, ఇంతటి ప్రజాధారణ కలిపించినందుకు ప్రేక్షాభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. గత ఏడాది తమిళంలో కూడా ఆహాని లాంచ్ చేశారు. కాగా..

3 Years for Aha : తెలుగు, తమిళ్.. ఆహా నెక్స్ట్ టార్గెట్ ఇండియా?

after telugu tamil aha next target india?

Updated On : February 8, 2023 / 1:09 PM IST

3 Years for Aha : తెలుగు నెంబర్ వన్ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ఆహా మూడవ వార్షికోత్సవం పూర్తి చేసుకొంది. ఫిబ్రవరి 8తో ఆహా లాంచ్ అయ్యి త్రీ ఇయర్స్ అవుతుంది. దీంతో ఆహా టీం తమకి ఇంతటి సక్సెస్ ని అందించి, ఇంతటి ప్రజాధారణ కలిపించినందుకు ప్రేక్షాభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాన్స్ అండ్ సింగింగ్ షోస్, వంట ప్రోగ్రామ్స్, టాక్ షోలు.. ఇలా ప్రేక్షకులు కోరుకొనే ప్రతి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తూ నెంబర్ వన్ ఓటిటి అనిపించుకుంది.

3 Years for Aha : టాక్ షోలో సరికొత్త సంచలనం సృష్టించిన ఆహా..

ఇక బాలయ్య అన్‌స్టాపబుల్ షోతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విపిరితమైన రీచ్ ని సొంతం చేసుకుంది. ఎంతలా అంటే ఆహా సైట్ సైతం క్రాష్ అయ్యే అంతలా క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఈ టాక్ షోకి కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర భాషల్లో కూడా మంచి ఆదరణ లభిస్తుంది. దీంతో ఆహాని ఇతర భాషల్లో కూడా లాంచ్ చేస్తూ వస్తున్నారు ఆహా టీం. గత ఏడాది తమిళంలో ఆహాని లాంచ్ చేశారు. ఇప్పటికే అక్కడ పలు సిరీస్, షోస్ తో ఆహా రన్ అవుతుంది. జీవా లాంటి స్టార్ హీరోలను హోస్ట్ గా పెట్టి తమిళంలో కూడా ఒక కొత్త అధ్యాయాన్ని రాయడానికి సిద్దమవుతుంది.

3 Years for Aha : ఓటిటి ప్రపంచంలో తెలుగు ప్రభంజనం ఆహా.. మూడవ వార్షికోత్సవం!

అలాగే సౌత్ లోని ఇతర భాషలతో పాటు ఇండియా వైడ్ ఆహా సేవలు మొదలు పెట్టేలా దూసుకుపోతుంది. అల్లు అర్జున్ కి మలయాళంలో సూపర్ ఫ్యాన్ బేస్ ఉంది. ఒకవేళ ఆహా ఇదే స్పీడ్ కొసాగిస్తే త్వరలో మలయాళంలో కూడా అడుగు పెట్టడం ఖాయం. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఏలుతుంది. త్వరలో మన ఆహా కూడా ఓటిటి రంగాన్ని ఏలే దిశగా సరి కొత్త ఒరవడితో సాగిపోతుంది. ప్రస్తుతం తన కొత్త షోస్ అండ్ వెబ్ సిరీస్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే హీరో నవదీప్ తో ఒక సిరీస్ ని ప్రకటించింది.