Agent : ఏజెంట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా? అఖిల్ కెరీర్ లోనే హైయెస్ట్.. అసలు బ్రేక్ ఈవెన్ చేస్తాడా?

ఇప్పటివరకు అఖిల్ నుంచి వచ్చిన సినిమాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తప్ప మిగిలినవి ఏవి ఆశించినంత విజయం సాధించలేదు. అసలు ఇప్పటివరకు అఖిల్ కు సరైన మార్కెట్ కూడా ఏర్పడలేదు.

Agent : ఏజెంట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా? అఖిల్ కెరీర్ లోనే హైయెస్ట్.. అసలు బ్రేక్ ఈవెన్ చేస్తాడా?

Agent Cinema Pre Release Business Details

Updated On : April 27, 2023 / 12:51 PM IST

Agent :  అక్కినేని అఖిల్, సాక్షి వైద్య(Sakshi Viadya) జంటగా, మమ్ముట్టి(Mammootty) ముఖ్య పాత్రలో సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కింది ఏజెంట్ సినిమా. అఖిల్ అక్కినేని(Akhil Akkineni) మొదటి సారి ఫుల్ మాస్, యాక్షన్ రోల్ లో కనిపించబోతున్నాడు. భారీ బడ్జెట్ సినిమాతో ఫుల్ యాక్షన్ మోడ్ లో అఖిల్ రాబోతున్నాడు. ఏప్రిల్ 28న ఏజెంట్ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

ఇప్పటివరకు అఖిల్ నుంచి వచ్చిన సినిమాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తప్ప మిగిలినవి ఏవి ఆశించినంత విజయం సాధించలేదు. అసలు ఇప్పటివరకు అఖిల్ కు సరైన మార్కెట్ కూడా ఏర్పడలేదు. కానీ అఖిల్, సురేందర్ రెడ్డి, కథని నమ్మి ఏకంగా 50 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారు నిర్మాత అనిల్ సుంకర. సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దీంతో అఖిల్ కెరీర్ లో ఏ సినిమాకు అవ్వనంత ప్రీ రిలీజ్ బిజినెస్ ఏజెంట్ సినిమాకు అయింది.

ఏజెంట్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్..

నైజం – 10 కోట్లు
ఆంధ్ర – 14.80 కోట్లు
సీడెడ్ – 4.50 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 3.80 కోట్లు
ఓవర్సీస్ – 3.10 కోట్లు

Dhruva – Agent : సురేందర్ రెడ్డి సినిమాటిక్ యూనివెర్స్.. చరణ్ అండ్ అఖిల్ సినిమా?

మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఏజెంట్ సినిమా 36.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇది అఖిల్ కెరీర్ లోనే హైయెస్ట్ బిజినెస్. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 38 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేయాలి. మరి అఖిల్ ఏజెంట్ సినిమాని బ్రేక్ ఈవెన్ చేస్తాడా చూడాలి.