Aha – Zebra : ఆహా ఓటీటీ లో ‘జీబ్రా’ సినిమా.. సత్యదేవ్ స్పెషల్ ఆఫర్..

థియేట్రికల్ రిలీజ్ పూర్తిచేసుకున్న జీబ్రా సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.

Aha – Zebra : ఆహా ఓటీటీ లో ‘జీబ్రా’ సినిమా.. సత్యదేవ్ స్పెషల్ ఆఫర్..

Aha OTT Announce Bumper Offer in Satyadev Zebra OTT Release Press Meet

Updated On : December 17, 2024 / 7:23 AM IST

Aha – Zebra : సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన ‘జీబ్రా’ సినిమా ఇటీవల నవంబర్ 22న థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించగా జెన్నిఫర్ పిషినాటో, సత్యరాజ్, సత్య.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్స్ నిర్మాణంలో ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సస్పెన్స్ జానర్లో బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు.

థియేట్రికల్ రిలీజ్ పూర్తిచేసుకున్న జీబ్రా సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఆహా ఓటీటీలో జీబ్రా సినిమా డిసెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి తాజాగా ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో ఆహా ఓటీటీ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆహా గోల్డ్ సబ్ స్క్రిప్షన్ తీసుకునే వాళ్ళల్లో లక్కీడ్రా తీసి అందులో వచ్చిన వాళ్లకు సత్యదేవ్ ఫేవరేట్ వాచ్, గ్లాసెస్ ఇస్తామని ప్రకటించారు. అవి డైరెక్ట్ గా సత్యదేవ్, సునీల్ చేతుల మీదుగా వారికి అందచేస్తామని ప్రకటించారు.

Also Read : Shanmukh Jaswanth : అవన్నీ గుర్తుచేసుకొని స్టేజిపైనే ఏడ్చేసిన ‘షన్ను’.. అమ్మా నాన్న సారీ.. షణ్ముఖ్ జస్వంత్ ఈజ్ బ్యాక్..

ఆహా గోల్డ్ సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే కాస్త బెనిఫిట్స్ కూడా ఎక్కువే. సంవత్సరానికి 999 రూపాయలతో ఆహా గోల్డ్ తీసుకుంటే తెలుగు సినిమాలు, సిరీస్ లతో పాటు తమిళ్ కంటెంట్ కూడా చూడొచ్చు. అంతే కాకుండా కొన్ని సినిమాలను రెండు రోజుల ముందే చూడొచ్చు. అలాగే కంటెంట్ కూడా 4K క్వాలిటీలో డాల్బీ సౌండ్ సిస్టంతో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఆహా గోల్డ్ సబ్ స్క్రిప్షన్ తీసుకోండి. సత్యదేవ్ వాచ్, గ్లాసెస్ గెలుచుకునే ఛాన్స్ మీకు రావొచ్చేమో..

ఇక జీబ్రా సినిమా కథ విషయానికొస్తే.. సూర్య(సత్యదేవ్) ఓ బ్యాంక్ లో పనిచేస్తూ ఉంటాడు. ఇంకో బ్యాంక్ లో పనిచేసే స్వాతి(ప్రియా భవాని శంకర్)తో ప్రేమలో ఉంటాడు. ఓ సారి స్వాతి చేసిన ఓ పొరపాటు వల్ల ఒక అకౌంట్ లో పడాల్సిన డబ్బులు ఇంకో అకౌంట్ లో పడతాయి. దీంతో ఆ డబ్బులు రావాల్సిన వ్యక్తి ఆమెని ఇబ్బంది పెట్టడంతో సూర్య బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోపాల్ని ఉపయోగించుకొని ఓ ఫ్రాడ్ చేసి ఆ డబ్బులు అతనికి వచ్చేలా చేస్తాడు. అదే సమయంలో ఆ డబ్బులు తప్పుగా పడిన అకౌంట్ నుంచి 5 కోట్లు మాయమయి సూర్య అకౌంట్ లో పడటంతో పాటు బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. దీంతో గ్యాంగ్ స్టర్ ఆది(డాలి ధనుంజయ) ఆ డబ్బుల కోసం సూర్య వెంటపడి తిరిగివ్వకపోతే తన తల్లిని చంపేస్తా అంటాడు. దీంతో సూర్య ఆ 5 కోట్ల కోసం ఏం చేసాడు? బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగే కొన్ని ఫ్రాడ్స్ ఏంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.