Aishwarya Lakshmi : చిన్నపుడు లైంగిక వేధింపులకు గురయ్యా.. ఐశ్వర్య లక్ష్మి!

మలయాళ సినిమాతో వెండితెరకు పరిచయమైన నటి 'ఐశ్వర్య లక్ష్మి'. సౌత్ లో క్రేజీ ఆఫర్లు అందుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. కాగా ఈ హీరోయిన్ నటించిన తాజా చిత్రం 'మట్టి కుస్తీ' విడుదలయ్యి థియేటర్ల వద్ద సందడి చేస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తుంది ఐశ్వర్య. ఇలా ఒక ఇంటర్వ్యూలో తాను కూడా చిన్నప్పుడు లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్లడించింది.

Aishwarya Lakshmi : చిన్నపుడు లైంగిక వేధింపులకు గురయ్యా.. ఐశ్వర్య లక్ష్మి!

Aishwarya Lakshmi Was sexually abused as a child

Updated On : December 6, 2022 / 7:34 PM IST

Aishwarya Lakshmi : మలయాళ సినిమాతో వెండితెరకు పరిచయమైన నటి ‘ఐశ్వర్య లక్ష్మి’. సౌత్ లో క్రేజీ ఆఫర్లు అందుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఇటీవల భారీ అంచనాలతో విడుదలైన ‘పొన్నియన్ సెల్వన్’ లాంటి పిరియాడికల్ మూవీలో నటించి పాన్ ఇండియా వైడ్ గుర్తింపుని సంపాదించుకుంది. ఇక ఓటిటిలో విడుదలైన ‘అమ్ము’లో నటించి ప్రశంసలు అందుకుంది.

Aishwarya Lekshmi: బ్లాక్ డ్రెస్‌లో ‘గాడ్సే’ బ్యూటీ హొయలు.. మాయ చేస్తోందిగా!

కాగా ఈ హీరోయిన్ నటించిన తాజా చిత్రం ‘మట్టి కుస్తీ’ విడుదలయ్యి థియేటర్ల వద్ద సందడి చేస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తుంది ఐశ్వర్య. ఇలా ఒక ఇంటర్వ్యూలో తాను కూడా చిన్నప్పుడు లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్లడించింది. “చిన్నప్పుడు కేరళలోని గురువాయూర్ ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక కుర్రాడు నా ప్రైవేట్ పార్ట్స్ ని తాకాడు. ఆ రోజు నేను పసుపు బట్టలు వేసుకున్నా.

ఆ సంఘటనతో అప్పటి నుండి పసుపు బట్టలు వేసుకోవాలంటే భయం. కానీ ఇప్పుడు ఆ భయం లేదు. చిన్నప్పుడే కాదు, ఇప్పుడు కూడా కొన్ని ప్రదేశాలకు ప్రమోషన్స్ కోసం వెళ్ళినపుడు ఇటువంటి సంఘటనలు ఎగురుకుంటూ ఉంటాం” అంటూ చెప్పుకొచ్చింది. అయితే మట్టి కుస్తీ సినిమాలో ఐశ్వర్య పసుపు బట్టలు వెయ్యాల్సి వచ్చింది. దీంతో ఆమె ఈ సంఘటను గుర్తు చేసుకుంది.