ఫుట్‌బాల్ కోచ్‌గా అజయ్ దేవ్‌గన్

అజయ్ దేవ్‌గన్ ఫుట్‌బాల్ కోచ్‌గా కనిపించనున్న ‘మైదాన్’ ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల..

  • Published By: sekhar ,Published On : January 30, 2020 / 12:42 PM IST
ఫుట్‌బాల్ కోచ్‌గా అజయ్ దేవ్‌గన్

Updated On : January 30, 2020 / 12:42 PM IST

అజయ్ దేవ్‌గన్ ఫుట్‌బాల్ కోచ్‌గా కనిపించనున్న ‘మైదాన్’ ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల..

Image

ఇటీవలే తన 100వ సినిమా ‘తానాజీ’ తో ప్రేక్షకులను ఆకట్టుకుని బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు బాలీవుడ్ కథానాయకుడు.. అజయ్‌ దేవ్‌గన్.. ఆయన మల్టీస్టారర్‌ చిత్రాల్లోనే కాదు, అన్ని రకాల ప్రాంతీయ భాషల్లోనూ నటిస్తున్నారు. అజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘మైదాన్‌’..

Image

హైదరాబాద్‌కి చెందిన ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీం జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ దర్శకత్వం వహిస్తుండగా, జీ స్టూడియో, బోనీకపూర్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గురువారం ‘మైదాన్’ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు.

Image

 

ఆ పోస్టర్లో అజయ్‌ చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఫుట్‌బాల్‌ ఆడుతున్నాడు. నీట్‌గా టక్‌ చేసుకొని చేతిలో బ్యాగ్‌తో పాటు, గొడుకు పట్టుకొని కాలితో బాల్‌ తంతున్న పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఆడుకుంటున్న ఆ ఫోస్టర్ల్‌ పలువురిని ఆకట్టుకునేలా ఉంది.

Image

తెలుగులో రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న భారీ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోనూ అజయ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. అజయ్ సరసన ప్రియమణి నటిస్తున్న ‘మైదాన్’ ఈ ఏడాది నవంబర్‌ 27న ప్రేక్షకుల ముందకు రానుంది.