Shalini Ajith : అన్న, చెల్లితో అజిత్ భార్య షాలిని..

కోలీవుడ్ స్టార్ ‘తల’ అజిత్ భార్య షాలిని చెల్లెలు బేబి షామిలిగా టాలీవుడ్‌లో చిన్నప్పుడే స్టార్‌డమ్ తెచ్చుకున్నారు..

Shalini Ajith : అన్న, చెల్లితో అజిత్ భార్య షాలిని..

Shalini Ajith

Updated On : January 25, 2022 / 6:07 PM IST

Shalini Ajith: ‘అల్టిమేట్ స్టార్’, ‘తల’ అజిత్ తమిళ నాట బిగ్ స్టార్.. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా ఆదరిస్తుంటారాయణ్ణి. తెలుగు వాడు అయిన అజిత్ తమిళనాడుకెళ్లి అక్కడ స్టార్‌గా ఎదగడం విశేషం. వరుస విజయాలతో, రికార్డ్ స్థాయి కలెక్షన్లతో ప్రపంచవ్యాప్తంగా తమిళ సినిమా, ఇండియన్ సినిమా సత్తా ఏంటనేది చూపించారు అజిత్.

Valimai Trailer : అజిత్ మాస్+డైరెక్టర్ బ్రెయిన్= మైండ్ బ్లోయింగ్ ట్రైలర్..

1999లో అజిత్, షాలిని కలిసి నటించిన ‘అమర్‌కలమ్’ (Amarkalam) సినిమా షూటింగ్ అప్పుడు షాలినికి ప్రపోజ్ చేసిన అజిత్, 2000 సంవత్సరంలో ఆమెను పెళ్లాడారు. వీరికి అనౌష్క, ఆద్విక్ సంతానం. ‘సఖి’ సినిమాతో మన తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు షాలిని.

Amarkalam

ఆమె చెల్లి బేబి షామిలిగా టాలీవుడ్‌లో చిన్న పాపగా ఉన్నప్పుడే స్టార్‌డమ్ తెచ్చుకున్నారు. సిద్దార్థ్‌ హీరోగా నటించిన ‘ఓయ్’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. కొంత గ్యాప్ తర్వాత నాగ శౌర్య పక్కన ‘అమ్మమ్మగారిల్లు’ వంటి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటించారు. షాలిని అన్నయ్య రిషి కూడా ఆడియన్స్‌కి తెలుసు. ఆయన అసలు పేరు రిచర్డ్ రిషి.

Ajith Kids

 

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘స్వప్నలోకం’, ‘బొబ్బిలి వంశం’ వంటి సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించారు. ‘A Film by బై అరవింద్’ తో హీరోగా మారారు. ‘భాగ్యలక్ష్మీ బంపర్ డ్రా’, ‘దమ్మున్నోడు’, ‘ఎందుకంటే.. ప్రేమంట!’, ‘ఊ కొడతారా? ఉలిక్కి పడతారా?’ వంటి సినిమాల్లో నటించారు.

Ajith : పాకిస్థాన్ ఇండియా బోర్డర్ వద్ద హీరో అజిత్