Akhil Akkineni : నాన్న పై ఆధారపడడం ఇష్టం లేదు.. అన్నయ్య, నేను మాట్లాడుకుంటాం!
ఏజెంట్ ప్రమోషన్స్ లో ఉన్న అఖిల్ ఒక ఇంటర్వ్యూలో నాగార్జున గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Akhil Akkineni comments on nagarjuna at Agent promotions
Akhil Akkineni : అక్కినేని హీరో అఖిల్ తాజాగా ఏజెంట్ (Agent) సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. సాక్షి వైద్య హీరోయిన్ గా డెబ్యూట్ ఇస్తుండగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఏప్రిల్ 28న రిలీజ్ కు రెడీ అవుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే అఖిల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగార్జున గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Naga Chaitanya – Akhil : మాస్ ఇమేజ్ కోసం అన్నదమ్ముల పోరాటం.. ఈసారి వచ్చేనా?
అఖిల్.. “ఏజెంట్ స్క్రిప్ట్ గురంచి నాన్నతో (Nagarjuna) అసలు మాట్లాడలేదు. ఎందుకంటే నా సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ కి నేను తీసుకునే నిర్ణయాలే కారణం కావాలి గాని ఇతరులు కాదు. మనం సొంతంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడేగా మనం ఎదిగేది. ఇంకెన్నాళ్లని నాన్న పైనే ఆధారపడతాను. నాన్న ఇచ్చే సలహాలు తీసుకుంటాను కానీ నిర్ణయాలు నేనే తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇక ప్రతి విషయం గురించి నేను, అన్నయ్య (Naga Chaitanya) మాట్లాడుకుంటూ ఉంటాం” అంటూ వ్యాఖ్యానించాడు.
Akhil Akkineni : శోభితతో నాగచైతన్య రిలేషన్.. మీడియా ముందు అఖిల్ ఏమి మాట్లాడాడో తెలుసా?
ఇక తన లైన్ అప్ లో నాలుగు సినిమాలు ఉన్నాయని తెలియజేయగా, అన్ని యాక్షన్ చిత్రాలే అని పేర్కొన్నాడు. జూన్‌లో ఒక సినిమా మొదలు కాబోతున్నట్లు చెప్పుకొచ్చాడు. అలాగే నాగార్జున 100వ సినిమా గురించి కూడా అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించి ఇంకా ఏదీ కన్ఫార్మ్ కాలేదంటూ తెలియజేశాడు. అటువంటి మైల్ స్టోన్ మూవీ చేసేటప్పుడు కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకొని చేయాలి కాబట్టి అందుకు తగట్టు కథ వెతుకుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఈ వ్యాఖ్యలతో నాగార్జున 100వ సినిమా పై వస్తున్న వార్తలు అన్నిటికి చెక్ పడింది.