Agent Movie: ఏజెంట్ సినిమాలో అది ఖచ్చితంగా ఉంటుందని చెప్పిన అఖిల్

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’లో లవ్ ట్రాక్ కూడా ఉంటుందని.. అది ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని అఖిల్ తెలిపాడు.

Agent Movie: ఏజెంట్ సినిమాలో అది ఖచ్చితంగా ఉంటుందని చెప్పిన అఖిల్

Akhil Akkineni Confirms Of Love Track In Agent Movie

Updated On : April 8, 2023 / 8:38 PM IST

Agent Movie: అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి స్పై థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రాబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Agent Movie: ఏజెంట్ కోసం బరిలోకి దిగుతున్న ఆర్ఆర్ఆర్ వీరులు..?

ఇక ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. నేడు అఖిల్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా నుండి వరుసగా అప్డేట్స్ ఇస్తూ సందడి చేస్తోంది చిత్ర యూనిట్. ఈ సినిమాలోని కొత్త పోస్టర్స్‌ను రిలీజ్ చేసి చిత్ర యూనిట్ సందడి చేస్తోంది. కాగా, ఈ సినిమాకు సంబంధించి అఖిల్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు. ఏజెంట్ సినిమాను యాక్షన్ డోస్‌తో నింపేశారని అభిమానులు భావిస్తున్నారని.. అయితే, ఈ సినిమాలో లవ్ ట్రాక్ కూడా ఉంటుందని.. అది ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని అఖిల్ తెలిపాడు.

Agent Movie: ఏజెంట్ థియేట్రికల్ రైట్స్‌కు భారీ రేటు.. అయ్యగారితో మామూలుగా ఉండదు!

ఈ సినిమాలో అఖిల్ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండగా, అందాల భామ సాక్షి వైద్యా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుండాగా, ఈ చిత్రానికి హిప్‌హాప్ తమిళ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 28న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.