కలిసికట్టుగా పోరడదాం.. దయచేసి రిజిస్టర్ చేసుకోండి..

  • Published By: sekhar ,Published On : July 16, 2020 / 01:32 PM IST
కలిసికట్టుగా పోరడదాం.. దయచేసి రిజిస్టర్ చేసుకోండి..

Updated On : July 16, 2020 / 6:04 PM IST

కరోనా వైరస్ రోజురోజుకీ ప్రపంచవ్యాప్తంగా తన ఉధృతిని కొనసాగిస్తోంది. కట్టడి చేస్తున్నా కేసులు పెరుగుతూనే ఉండడంతో ఏం చేయాలో తెలియక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు, సినీ కార్మికులను ఆదుకోవడనాకి పలువురు సినీ వర్గాల వారు తమవంతు సాయమందిస్తున్న సంగతి తెలిసిందే. మరికొందరు సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రజలను చైతన్యపరచే దిశగా పోస్టులు చేస్తున్నారు.

తాజాగా కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో అందరూ కలిసికట్టుగా పోరాడాలని యంగ్ హీరో అఖిల్ అక్కినేని సూచించాడు. ఇప్పటికే కోవిడ్-19 నుంచి కోలుకున్న వారు తమ ప్లాస్మాను దానం చేసి ఇతరులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశాడు. ప్లాస్మా దానం చేయాలనుకున్న వారు givered.in లో రిజిస్టర్ చేయించుకోవాలని ట్వీట్ చేశాడు.

Akhil Tweet

‘ఒకవేళ మీరు కోవిడ్-19 నుంచి కోలుకున్న వారైతే దయచేసి ప్లాస్మా దాతగా రిజిస్టర్ చేయించుకోండి. అవసరంలో ఉన్న వారికి అండగా నిలవండి. మీ పేరును givered.inలో రిజిస్టర్ చేయించుకోండి’ అని అఖిల్ తనవంతు బాధ్యతగా ట్వీట్ చేశాడు.