Suzanne Bernert : నటుడు అఖిల్ మిశ్రా మృతికి కారణం చెప్పిన భార్య సుజానే బెర్నెర్ట్

ప్రముఖ బాలీవుడ్ నటుడు అఖిల్ మిశ్రా మరణంపై ఆయన భార్య సుజానే బెర్నెర్ట్ స్పందించారు. అతను లేకుండా ఎలా బ్రతకాలో అర్ధం కావట్లేదని విచారం వ్యక్తం చేసారు. అఖిల్ చనిపోవడానికి కారణం వెల్లడించారు.

Suzanne Bernert : నటుడు అఖిల్ మిశ్రా మృతికి కారణం చెప్పిన భార్య సుజానే బెర్నెర్ట్

Suzanne Bernert

Updated On : September 21, 2023 / 4:55 PM IST

Suzanne Bernert : ప్రముఖ బాలీవుడ్ నటుడు అఖిల్ మిశ్రా (Akhil Mishra) మరణించిన సంగతి తెలిసిందే. ఈయన మరణంపై రకరకాలుగా వార్తలు వచ్చాయి. సరైన కారణం మాత్రం బయటకు రాలేదు. అయితే ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్టూల్ పై నుంచి పడిపోయి చనిపోయినట్లు ఆయన భార్య సుజానే బెర్నెర్ట్ ధృవీకరించారు.

Udaipur : తన చావుకి భార్య, స్నేహితురాలు కారణమంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టి సూసైడ్ చేసుకున్న జర్నలిస్ట్

బాలీవుడు నటుడు అఖిల్ మిశ్రా తన 67వ ఏట కన్నుమూశారు. ఆయన 3 ఇడియట్స్, డాన్ వంటి సినిమాల్లో నటించారు. టీవీ షోలలో కూడా పనిచేశారు. అతని అకాల మరణం కుటుంబ సభ్యులను, స్నేహితులను దిగ్భ్రాంతిలోకి నెట్టేసింది. ఆయన కిచెన్‌లో వర్క్ చేస్తూ కాలుజారి కిందపడటంతో తలకు గాయమై మరణించారని వార్తలు వచ్చాయి. ఈ వార్త వాస్తవమేనని ఆయన భార్య సుజానే బెర్నెర్ట్ స్పష్టం చేశారు.

అఖిల్ మిశ్రా మరణంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. షాక్‌లో ఉన్న ఆయన భార్య సుజానే స్పందించారు. అఖిల్ హైబీపీతో గత నెల ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారని, కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. అఖిల్ ఆరోగ్యం బాగా ఉన్న సమయాల్లో కిచెన్ వర్క్‌లో సాయం చేస్తాడని, అలా కిచెన్‌లో ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగిందని సుజానే తెలిపారు. ఈ సంఘటన జరిగినపుడు ఎవరూ ఇంట్లో లేరని, తమ కుటుంబ సభ్యుల్లో ఒకరు ఇంటికి రావడంతో అఖిల్ పడిపోయి ఉండటం తెలిసిందని ఆమె చెప్పారు. ఇరుగుపొరుగువారు ఆసుపత్రికి తరలించినా తీవ్రంగా రక్తస్రావం కావడంతో వైద్యులు తనని కాపాడలేకపోయారని సుజానే చెప్పారు.

Near Death Experience: ఆత్మలు ఉన్నాయి,మరణం తరువాత మరో జీవితం ఉంది : రుజువులున్నాయంటున్న అమెరికా డాక్టర్

జర్మనీ నటి అయిన సుజానే బెర్నెర్ట్ ను 2009 లో అఖిల్ మిశ్రా పెళ్లి చేసుకున్నారు. 2011లో సంప్రదాయబద్దంగా వీరు వివాహం చేసుకున్నారు. ‘అఖిల్ నా సోల్ మేట్.. నా బెటర్ హాఫ్.. అతను నాకు తండ్రిలా, గురువులా ఉండేవాడు. అతను లేకుండా ఎలా బ్రతకాలో అర్ధం కావట్లేదు.. అతని మరణం వల్ల నేను చాలా కోల్పోయాను’ అంటూ సుజానే విచారం వ్యక్తం చేసారు.