న్యూ ఇయర్ – న్యూ ఇయర్ బైక్
బీఎండబ్ల్యూ, ఆర్ నైన్ టీ మోడల్ స్పోర్ట్ బైక్ కొన్న అక్కినేని నాగ చైతన్య
బీఎండబ్ల్యూ, ఆర్ నైన్ టీ మోడల్ స్పోర్ట్ బైక్ కొన్న అక్కినేని నాగ చైతన్య
అక్కినేని నాగ చైతన్యకి స్పోర్ట్స్ బైక్స్, కార్స్ అంటే చాలా ఇష్టం. చైతు గ్యారేజ్‌లో ఇప్పటికే పలు లగ్జీరియస్ కార్లు, బైక్‌లు ఉన్నాయి. మార్కెట్‌లోకి ఏదైనా కొత్త మోడల్ వచ్చిందంటే చాలు. వెంటనే కొనేస్తాడు. అలా కొన్న బైక్స్‌పై ఎవరూ గుర్తు పట్టకుండా హెల్మెట్ పెట్టుకుని, హైదరాబాద్ రోడ్లపై రయ్‌న దూసుకెళ్తుంటాడు. ఇప్పుడు చైతు మరో కొత్త మోడల్ బైక్‌పై మనసు పడ్డాడు. ఆ మోడల్ మార్కెట్‌లోకి దిగగానే, ఏమాత్రం లేట్ చెయ్యకుండా వెంటనే వెళ్ళి కొనేసాడు. సరికొత్త బీఎండబ్ల్యూ, ఆర్ నైన్ టీ మోడల్ స్పోర్ట్ బైక్‌ని చైతు స్వయంగా షోరూంకి వెళ్ళి కొన్నాడు.
అత్యాధునిక ఫీచర్స్‌తో రూపొందించిన ఈ బైక్ ఖరీదు, దాదాపు రూ.17 లక్షలు ఉంటుందట. ఇక మీదట బీఎండబ్ల్యూ ఆర్ నైన్ టీ బైక్‌పై చైతు రైడ్ స్టార్ట్ చెయ్యబోతున్నాడు. ఇంతకుముందు సమంత, చైతుకి ప్రేమతో, దాదాపు కోటిన్నర పెట్టి, బీఎండబ్ల్యూ లేటెస్ట్ 7సిరీస్ కారు కొనిచ్చింది. చైతు గ్యారేజ్‌కెళ్తే బోలెడన్ని స్పోర్ట్ బైక్స్, కార్స్ కలెక్షన్ చూడొచ్చు. ప్రస్తుతం చైతు, సమంత కలిసి మజిలీ సినిమాలో నటిస్తున్నారు.
శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న మజిలీ రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. దీని తర్వాత మామయ్య విక్టరీ వెంకటేష్‌తో కలిసి, బాబీ డైరెక్షన్‌లో వెంకీమామ సినిమా చెయ్యబోతున్నాడు చైతు.