Custody Teaser Released : నిజమే ఆయుధం.. ఆ నిజం నా ‘కస్టడీ’లో ఉంది.. నాగచైతన్య మాస్ యాక్షన్ ఇరగొట్టేశాడు..

అక్కినేని హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. క ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు.

Custody Teaser Released : నిజమే ఆయుధం.. ఆ నిజం నా ‘కస్టడీ’లో ఉంది.. నాగచైతన్య మాస్ యాక్షన్ ఇరగొట్టేశాడు..

Akkineni Naga Chaitanya Custody Teaser Released

Updated On : March 16, 2023 / 5:56 PM IST

Custody Teaser Released : అక్కినేని హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’. టాలీవుడ్ లో రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ మూవీస్ హీరో అనిపించుకుంటున్న చైతన్య.. కుదిరినప్పుడు అల్లా మాస్ హీరో ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలోనే దడ, దోచేయ్, సవ్యసాచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమాలు నాగచైతన్యకి మాస్ ఇమేజ్ ని తెచ్చి పెట్టలేకపోయాయి. ఇప్పుడు మరోసారి మాస్ హీరోగా తన అదృష్టం పరీక్షించుకోడానికి కస్టడీ సినిమాతో వస్తున్నాడు.

Naga Chaitanya : నాగచైతన్య పై క్రష్ ఉందంటున్న మజిలీ బ్యూటీ.. పెళ్లి వార్తలు పై క్లారిటీ!

తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో బై లింగువల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. టీజర్ తోనే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో ఒక హింట్ ఇచ్చేసాడు దర్శకుడు. 90’s బ్యాక్‌డ్రాప్ తో ఈ సినిమా కథ ఉండబోతుందని అర్ధమవుతుంది. ఇక నాగచైతన్య ఇప్పటివరకు చేయని మాస్ యాక్షన్స్ తో ఇరగొట్టేశాడు అని టీజర్ లో కనిపిస్తుంది.

టీజర్ మొత్తాన్ని నాగచైతన్య వాయిస్ ఓవర్ తో నడిపించారు. చైతన్య చెప్పిన డైలాగ్స్.. కథ ఏంటో చెప్పడమే కాదు, పవర్ ఫుల్ గా కూడా ఉన్నాయి. ‘గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరమైన తీసుకు వెళ్తుంది. అది ఇప్పుడు తీసుకు వచ్చింది నన్ను ఒక యుద్దానికి’, ‘నా చేతిలో ఉన్న ఆయుధం నిజం’, ‘నిజం ఒక ధైర్యం, నిజం ఒక సైన్యం, ఆ నిజం నా కస్టడీలో ఉంది’ అంటూ చెప్పిన డైలాగ్స్ సినిమా పై అంచనాలు పెంచేస్తున్నాయి.

Naga Chaitanya: ఆ డైరెక్టర్‌తో చైతూ మూవీ.. లేనట్టేనా..?

నాగచైతన్య మేక్ ఓవర్ చూస్తుంటే ఈ సినిమా కోసం బాగా కష్టపడినట్లు ఉంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కృతిశెట్టి నటిస్తుంది. అరవింద్ స్వామి విలన్ గా నటిస్తుండగా శరత్ కుమార్, ప్రియమణి, సంపత్ రాజ్, వెన్నల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారు. మాస్ట్రో ఇళయరాజా అండ్ యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. టీజర్ కి ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూపర్ ఉంది. టీజర్ చూస్తుంటే ఈసారి చైతన్య మాస్ ఇమేజ్ అందుకోడవంలో ఎటువంటి సందేహం లేదని అరదమవుతుంది.