Akshay Kumar: “ఛత్రపతి శివాజీ”గా అక్షయ్ కుమార్..
హిట్టు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతుంటాడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. ప్రస్తుతం ఈ హీరో సెల్ఫీ, ఓ మై గాడ్ 2, సూరరై పొట్రు రీమేక్ చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే, తాజాగా అక్షయ్ మరో హిస్టారికల్ బయోపిక్ మూవీలో నటించబోతున్నాడని తెలుస్తుంది.

Akshay Kumar as Chhatrapati Shivaji Maharaj
Akshay Kumar: హిట్టు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతుంటాడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. ప్రస్తుతం ఈ హీరో సెల్ఫీ, ఓ మై గాడ్ 2, సూరరై పొట్రు రీమేక్ చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే, తాజాగా అక్షయ్ మరో హిస్టారికల్ బయోపిక్ మూవీలో నటించబోతున్నాడని తెలుస్తుంది.
Akshay Kumar : వరుస ఫ్లాపులు.. రెమ్యునరేషన్ తగ్గించుకున్న అక్షయ్ కుమార్.. కానీ..
మహారాష్ట్ర దిగ్గజ రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్‌పై అక్షయ్ కుమార్ సినిమా చేయడానికి సిద్దమవుతున్నాడని తెలుస్తుంది. నిన్న ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు కమ్ ఫిల్మ్ మేకర్ మహేష్ మంజ్రేకర్ ఈ భారీ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.
వీర్ దౌడలే సాత్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే చాలా వరకు పూర్తయినట్లు, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు మరియు ఇతర భాషలలో కూడా డబ్ చేయనున్నారట. దీపావళి 2023 థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ఆలోచిస్తున్నారు.