Akshay Kumar : గుర్తుపెట్టుకోండి, సినిమాల వల్ల దేశానికి డబ్బులొస్తున్నాయి.. సినిమాల బాయ్‌కాట్ పై అక్షయ్ కుమార్ వ్యాఖ్యలు..

అక్షయ్ కుమార్ నటించిన రక్షా బంధన్ సినిమా కూడా లాల్ సింగ్ చడ్డా తో పాటు రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అక్షయ్ ఇటీవల ప్రెస్ మీట్ లో సినిమాలు బాయ్ కాట్ చేయడం పై మాట్లాడాడు. అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.........

Akshay Kumar : గుర్తుపెట్టుకోండి, సినిమాల వల్ల దేశానికి డబ్బులొస్తున్నాయి.. సినిమాల బాయ్‌కాట్ పై అక్షయ్ కుమార్ వ్యాఖ్యలు..

Akashay Kumar

 

Akshay Kumar :  ఇటీవల అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా సినిమాని బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. గతంలో అమీర్ ఖాన్ భారతదేశం మీద చేసిన వ్యాఖ్యలకి సినిమాని బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే దీనిపై అమీర్ ఖాన్ స్పందించాడు. తాజాగా అక్షయ్ కుమార్ కూడా దీనిపై స్పందించాడు.

Aamir Khan : నా సినిమాని బాయ్‌కాట్ చేయాలి అనుకుంటే మీ సెంటిమెంట్‌ని గౌరవిస్తాను..

అక్షయ్ కుమార్ నటించిన రక్షా బంధన్ సినిమా కూడా లాల్ సింగ్ చడ్డా తో పాటు రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అక్షయ్ ఇటీవల ప్రెస్ మీట్ లో సినిమాలు బాయ్ కాట్ చేయడం పై మాట్లాడాడు. అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. ”భారత్‌ ప్రపంచంలోనే గొప్ప దేశాల్లో ఒకటిగా ఆవిర్భవిస్తున్న సమయం ఇది. మన దేశంలో స్వేచ్ఛ ఉంది. అందరూ వారి అభిప్రాయాలని చెప్పొచ్చు. ఇలాంటి తరుణంలో సినిమాల గురించి కూడా పాజిటివ్‌గా ఆలోచించాలి. సినిమా రంగం కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు సపోర్ట్ చేస్తుంది. సినిమాలు ఆడితే డబ్బులు వస్తాయి. దాని వల్ల ట్యాక్స్ లు కట్టి దేశానికి సపోర్ట్ గా నిలుస్తాం. ఏవో చిన్న కారణాలతో సినిమాల్ని వివాదాల్లోకి లాగి, సినిమాలని బాయ్ కాట్ చేస్తా అనడం కరెక్ట్ కాదు” అని అన్నారు. మరి అక్షయ్ చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.