Akshay Kumar : సెల్ఫీలతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టిన అక్షయ్ కుమార్‌..

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌ నటిస్తున్న తాజా చిత్రం 'సెల్ఫీ'. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు.

Akshay Kumar : సెల్ఫీలతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టిన అక్షయ్ కుమార్‌..

Akshay Kumar broke the Guinness World Record with selfies

Updated On : February 22, 2023 / 8:35 PM IST

Akshay Kumar : బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘సెల్ఫీ’. అక్షయ్ గత నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేక పోయాయి. ఈ మూవీతో ఎలా అయిన హిట్ కొట్టాలని చాలా ట్రై చేస్తున్నాడు. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ మొత్తం తన భుజాలు మీద వేసుకున్నాడు. ఈ క్రమంలోనే పలువురు సెలెబ్రెటీస్ తో కలిసి షార్ట్ రీల్ వీడియోలు చేస్తూ సందడి చేస్తున్న అక్షయ్. తాజాగా అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు.

Akshay Kumar : మొదలైన అక్షయ్ కుమార్ ఛత్రపతి శివాజీ మూవీ..

ఈరోజు (ఫిబ్రవరి 22) సెల్ఫీ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఫ్యాన్ మీట్ నిర్వహించాడు. ఈ ఈవెంట్ లో కేవలం మూడు నిమిషాల్లో 184 సెల్ఫీలు దిగి గిన్నిస్ రికార్డు సాధించాడు. ఈ ఘనత సాధించడంతో గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్ అందుకున్న ఫోటోను పోస్ట్ చేస్తూ ఎమోషనల్ కామెంట్ చేశాడు. ‘నేను జీవితంలో ఇక్కడి వరకు చేరుకోవడమే కాదు నా లైఫ్ లో నేను సాధించిన ప్రతిదానికి కారణం అభిమానులే. నా కెరీర్ లో నాకు అండగా నిలిచిన నా అభిమానులకు ఈ రివార్డు అంకితం’ అంటూ రాసుకొచ్చాడు.

కాగా ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ ‘డ్రైవింగ్ లైసెన్స్’ కి రీమేక్. అక్షయ్ కుమార్‌, ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ మూవీని రాజ్ మెహతా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ చిత్రం. ఇక కష్టాల్లో పడిపోయిన బాలీవుడ్ ని పఠాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ కొంత వరకు లేపాడు. ఇప్పుడు అక్షయ్ కుమార్ వంతు వచ్చింది. అయితే ఇటీవల కాలంలో సౌత్ రీమేక్ లు ఏమి నార్త్ లో వర్క్ అవుట్ అవ్వడం లేదు. మరి అక్షయ్ ఈ సినిమాతో ఎటువంటి రిజల్ట్ చూస్తాడో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)