ఫోని బాధితులకు కోటి రూపాయలు ఇచ్చిన అక్షయ్

  • Published By: veegamteam ,Published On : May 7, 2019 / 07:46 AM IST
ఫోని బాధితులకు కోటి రూపాయలు ఇచ్చిన అక్షయ్

Updated On : May 7, 2019 / 7:46 AM IST

ఫోని తుఫాను సృష్టించిన భీబ‌త్సం అంతా ఇంతా కాదు. ఈ ఫోని తుఫాను కారణంగా ఒడిశాలో సుమారు 34 మంది మృతి చెందగా, కొన్ని వందల కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఈ తుఫాను ప్ర‌భావం వ‌ల‌్ల చాలా మంది ప్రజలు నిరాశ్ర‌యులయ్యారు.

అయితే బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఒడిస్సా ప్రజలకు త‌న వంతు సాయంగా కోటి రూపాయ‌ల విరాళం అందించారు. ప్రకృతి విపత్తులు ఎప్పుడు సంభవించిన ప్రజలను ఆదుకునేందుకు అక్షయ్ ఎప్పుడు ముందుంటారు. గతంలో కేరళ, చెన్నైలో తుఫాను బీభత్సం సృష్టించినప్పుడు కూడా అక్షయ్ తన వంతు సహాయాన్ని అందచేశారు.
అంతేకాదు “భారత్ కే వీర్‌” వెబ్‌సైట్‌ ద్వారా జవాను కుటుంబాలను కూడా ఆదుకుంటున్నారు. 

కేవలం తన సినిమాలతోనే కాకుండా ఇలాంటి సేవ కార్యక్రమాలలో కూడా తన వంతు సహాయం అందిస్తూ అక్షయ్ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. చివ‌రిగా కేస‌రి చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన అక్ష‌య్ ప్ర‌స్తుతం రోహిత్ శెట్టి డైరెక్ష‌న్‌లో సూర్య‌వంశీ అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. గుడ్ న్యూస్ అనే చిత్రంలోను అక్ష‌య్ న‌టిస్తున్నాడు.