ALCC : ‘ఏ ఎల్ సి సి’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే.. ఓ యూనివర్సల్ బ్యాచిలర్ కథ..
తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ALCC O Universal Bachelor Katha Movie Re;ease Date and Pre Release Event
ALCC Movie : LR ఫిల్మ్ సర్కూట్స్ బ్యానర్‌పై లేలీధర్ రావు కోలా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఏ ఎల్ సి సి’ (ఓ యూనివర్సల్ బ్యాచిలర్). ఈ సినిమా ఏప్రిల్ 25 రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్లో హీరో JP నవీన్ మాట్లాడుతూ.. ఒక యంగ్ స్టర్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా హీరోగా ఎంట్రీ అవ్వడం అంటే చాలా కష్టం. నా లాంటి వ్యక్తికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దర్శకుడు లేలీధర్ రావు గారికి కృతజ్ఞతలు. మా లాంటి కొత్తవాళ్ళని దయచేసి సపోర్ట్ చెయ్యండి అని అన్నారు.
Also Read : 6 Journey : బిగ్ బాస్ టేస్టీ తేజ కీలక పాత్రలో నటించిన ‘6 జర్నీ’.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే..
డైరెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. ఈ సినిమా చిన్న సినిమా అయినా ఒక వైవిధ్యమైన సినిమా. డైరెక్టర్ లేలీధర్ రావు కోలా చాలా బాగా తీశారు. నష్టాలు వస్తున్నాయని రైతు వ్యవసాయం ఆపడు. మేము కూడా అంతే. సినిమాలు ప్లాప్ అవుతున్నాయని సినిమాలు చెయ్యడం మానము. ఇంకా కొత్త కొత్త సినిమాలు చెయ్యడానికి ప్రయత్నిస్తాం అని అన్నారు.
https://www.youtube.com/watch?v=4eGPdB6l-Qw
డైరెక్టర్ సముద్ర మాట్లాడుతూ.. లేలీధర్ రావు ఒక మంచి టీచర్. పిల్లల భవిష్యత్తు కోసం గొప్ప గొప్ప పాఠాలు చెప్పారు. అలాంటి గొప్ప టీచర్ నేడు డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా మారి ఈ సినిమా చేశారు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవ్వాలని అన్నారు. ఈ సినిమా డైరెక్టర్ లేలీధర్ రావు కోలా మాట్లాడుతూ.. ఈ సినిమాని ఎంతో ఇష్టంగా తీశాను. కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నాను. ఈ సినిమా కోసం నా టీం చాలా కష్టపడింది అని తెలిపారు.