Telangana Govt : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి..
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో మోడల్ స్కూళ్లలో అడ్మిషన్ల విధానంలో మార్పులు చేసేందుకు
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో మోడల్ స్కూళ్లలో అడ్మిషన్ల విధానంలో మార్పులు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ఇప్పటికే ప్రపోజల్స్ పంపించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 194 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో ఆరు నుంచి ఇంటర్ వరకు విద్యాబోధన అందుబాటులో ఉంది. అయితే, గురుకులాల్లో ఐదో తరగతి నుంచి క్లాసులు ప్రారంభం అవుతున్నాయి. దీంతో ఇదే విధానాన్ని మోడల్ స్కూళ్లలోనూ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రపోజల్స్ ను విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే.. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి మోడల్ స్కూళ్లలో ఐదో తరగతికే అడ్మిషన్లు మొదలు పెట్టాలని నిర్ణయించారు.
ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఐదు, ఆరు తరగతుల్లో అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్ష పెట్టేందుకు విద్యాశాఖ అధికారులు ప్లాన్ చేస్తున్నారు.
ఒకవేళ ప్రభుత్వం నుంచి ఈ ప్రపోజల్ కు అనుమతి లభిస్తే.. 5, 6 తరగతులకు ఒకే సమయంలో ఎంట్రెన్స్ నిర్వహిస్తారు. ప్రభుత్వం నుంచి అనుమతి రావడం లేట్ అయితే మాత్రం.. ఎప్పటిలాగే కేవలం ఆరో తరగతి అడ్మిషన్ల కోసమే నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
దీనికి అనుగుణంగా జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నూతన తరగతుల ప్రారంభం పై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
