Alia Bhatt : నా స్పీచ్ విని కడుపులో ఉన్న బిడ్డ నన్ను తంతున్నాడు.. అయినా నేను ఫ్రెంచ్‌ఫ్రైస్ తినడం మానను..
అలియా మాట్లాడుతూ.. ''నేను నటించడం మొదలుపెట్టినప్పుడే ఫిక్స్ అయ్యాను,ఎంత కష్టమైనా భరించాలని. నా కష్టాన్ని ప్రపంచం గుర్తించాలని కోరుకున్నాను. క్యారెక్టర్ ని పండించడానికి.........
Alia Bhatt : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఇటీవల వరుసగా గంగూబాయి కతీయవాడి, ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్రం సినిమాలతో అలరించి మంచి విజయాల్ని అందుకుంది. రణబీర్ ని పెళ్లి చేసుకొని మ్యారేజ్ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది అలియా భట్. తాజాగా అలియా సింగపూర్‌లో ‘టైమ్100ఇంఫాక్ట్’ అవార్డు అందుకుంది.
ఈ ఈవెంట్ లో అలియా మాట్లాడుతూ.. ”నేను నటించడం మొదలుపెట్టినప్పుడే ఫిక్స్ అయ్యాను,ఎంత కష్టమైనా భరించాలని. నా కష్టాన్ని ప్రపంచం గుర్తించాలని కోరుకున్నాను. క్యారెక్టర్ ని పండించడానికి ఎంత కష్టమైనా పడతాను. నా శరీర బరువు, రూపాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయడానికి కూడా చాలా కష్టపడతాను. కానీ నేను ఫ్రెంచ్‌ఫ్రైస్ తినడం మాత్రం మానను” అని తెలిపింది.
Prabhas : ఆదిపురుష్ సినిమా ఒప్పుకోవడానికి మూడు రోజులు ఆలోచించాను.. రాముడే ఈ సినిమా చేయించాడు..
అలియా తన ఫ్యామిలీ గురించి చెప్తూ.. ”నాకు జన్మనిచ్చినందుకు, సపోర్ట్ చేసినందుకు మా పేరెంట్స్ కి ధన్యవాదాలు. అలాగే నా భర్త రణ్‌బీర్ కపూర్‌కు స్పెషల్ థ్యాంక్స్. నేను వీళ్లందరికీ విడివిడిగా అవార్డులు ఇవ్వాలి. వీటన్నికంటే అద్భుతమైన విషయం ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడే స్పీచ్ విని నా కడుపులో ఉన్న బిడ్డ నన్ను తంతున్నాడు” అంటూ సరదాగా మాట్లాడింది.