మేమిద్దరం పెళ్లి చేసుకోట్లేదు: తేల్చి చెప్పేసిన టాప్ హీరోయిన్

గత కొంతకాలంగా బాలీవుడ్ టాప్ హీరోహీరోయిన్లు అలియా భట్, రణ్‌బీర్ కపూర్‌లు డేటింగ్‌లో ఉన్నారంటూ వచ్చిన వార్తలను అలియా భట్ ఖండించింది. తమ మధ్య అటువంటిదేమీ లేదని, రణ్‌బీర్ కపూర్‌ను తాను పెళ్లి చేసుకుంటున్నట్లు వచ్చిన వార్తలు వట్టి పుకార్లే అంటూ కొట్టిపారేసింది.
తమకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పిన అలియా.. తనకు మంచి చేసిన వ్యక్తులను గుర్తుంచుకోవడం తన బాధ్యత అని, అటువంటి వ్యక్తుల్లో రణ్‌బీర్ కపూర్ కూడా ముఖ్యమైన వ్యక్తి అని అలియా చెప్పారు.
అయితే గతంలో 64వ ఫిల్మ్‌ఫేర్ అవార్డు వేడుకలో ఆలియా భట్.. రణ్‌బీర్ కపూర్‌కు అందరి సమక్షంలో ఐ లవ్ యూ చెప్పగా వీరి మధ్య లవ్ ఉందని స్పష్టం అయింది. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు అలియా అటువంటి వార్తలను ఖండించడం విశేషం.