మీ దేశంలో నటించుకోండి : పాక్ నటులపై AICWA బ్యాన్

  • Published By: venkaiahnaidu ,Published On : February 18, 2019 / 08:00 AM IST
మీ దేశంలో నటించుకోండి : పాక్ నటులపై  AICWA బ్యాన్

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎప్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్(AICWAI)తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. 
ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న పాకిస్తాన్ నటులు, కళాకారులపై పూర్తిగా బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది.

పుల్వామా ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, అమరజవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని, ఇటువంటి టెర్రర్, అరచకాలు కొనసాగుతున్న సమయంలో AICWA దేశం కోసం నిలబడుతుందని ఆ నోట్ లో తెలిపింది. దేశం మొదట తమకు ముఖ్యమని తెలిపింది.  ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న పాక్ నటులు,కళాకారులపై అధికారంగా పూర్తి బ్యాన్ విధిస్తున్నట్లు తెలిపింది. ఒకవేళ ఏదైనా ఆర్గనైజేషన్ లో కనుక ఏఐసీడబ్యూఏ బ్యాన్ చేసిన పాక్ ఆర్టిస్టులు పనిచేస్తున్నట్లయితే ఆ ఆర్గనైజేషన్ పై కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది. 

ఫిబ్రవరి-14న పుల్వామా జిల్లాలో పాక్ ఉగ్రసంస్థ జైషే మహమద్ ఆత్మాహుతి దాడి జరిపి 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ హస్తముందన్నట్లు తెలుస్తోంది.  పాక్ కి ఇప్పటికే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ని కూడా భారత్ ఉపసంహరించుకొంది.