Megastar : బర్త్ డే రోజున ఇలా చేయండి అంటూ చిరు పిలుపు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలని, కాలుష్యానికి చెక్ పెట్టాలంటే..ప్రకృతి వైపరీత్యాలు తగ్గాలంటే...మొక్కలు నాటడమే కరెక్ట్ అని చిరంజీవి తెలిపారు.

Megastar : బర్త్ డే రోజున ఇలా చేయండి అంటూ చిరు పిలుపు

Chiru

Updated On : August 21, 2021 / 1:26 PM IST

Birthday Chiranjeevi : ఆగస్టు 22 వచ్చిందంటే చాలు..మెగా అభిమానులకు పండుగ రోజు. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంటుంటారు. సామాజిక కార్యక్రమాలు చేస్తూ..రక్తదానం చేస్తుంటారు. ప్రస్తుతం కరోనా కారణంగా..చాలా మంది నటులు జన్మదినాలకు దూరంగా ఉంటున్నారు. తమింటికి రావొద్దని…ఎక్కడికక్కడ సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిస్తున్నారు. తాజాగా..చిరంజీవి కూడా అభిమానులకు పిలుపునిచ్చారు. 2021, ఆగస్టు 21వ తేదీ శనివారం ఉదయం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

Read More : Zycov-D : భారత్ లో పిల్లల కోసం మొట్టమొదటి కోవిడ్ వ్యాక్సిన్

తన జన్మదినం సందర్భంగా…గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాలుష్యానికి చెక్ పెట్టాలంటే..ప్రకృతి వైపరీత్యాలు తగ్గాలంటే…మొక్కలు నాటడమే కరెక్ట్ అని చెప్పారు. భవిష్యత్ తరాలు బాగుండాలంటే..ఈ కార్యక్రమంలో అభిమానులందరూ పాల్గొనాలన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మీరంతా పాల్గొనాలని, మూడు మొక్కలు నాటి తన ట్విట్టర్ లో ట్యాగ్ చేయాలని చిరు సూచించారు. చిరంజీవి చేసిన ట్వీట్ కు ఎంపీ సంతోష్ కుమార్ స్పందించి కృతజ్ఞతలు తెలిపారు. తన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న చిరంజీవి ఆయురారోగ్యాలతో కలకాలం అభిమానులు అలరించాలని ఆకాంక్షించారు.

Read More :Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ బ్రేక్..

ఇక చిరంజీవి విషయానికి వస్తే..రాజకీయాలకు దూరంగా ఉంటూ..ఇటీవలే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. వరుస సినిమాలకు సైన్ చేస్తూ..బిజీగా ఉండిపోతున్నారు. ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. క్లైమాక్స్ పెండింగ్ లో ఉందని సమాచారం. ‘లూసిఫర్’ చిత్రంలో చిరు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి.