Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ బ్రేక్..

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ షూటింగ్ నుండి బ్రేక్ తీసుకున్నారు..

Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ బ్రేక్..

Pk

Pawan Kalyan: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మూవీని.. ‘భీమ్లా నాయక్’ పేరుతో.. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ రీమేక్ చేస్తున్నారు.

Bandla Ganesh : ‘‘రామాయణం.. మహాభారతం.. ‘గబ్బర్ సింగ్’.. ఏమైనా పోల్చాడా..!

సాగర్.కె.చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పవర్ స్టార్ పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఇండిపెండెన్స్ డే నాడు వదిలిన ఫస్ట్ గ్లింప్స్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ షూటింగ్ నుండి బ్రేక్ తీసుకున్నారు.

Pawan Kalyan : క్లీన్ స్మాష్.. ‘భీమ్లా నాయక్’ ఆల్ టైమ్ టాప్ 1 రికార్డ్..

ఈ విషయం తెలియజేస్తూ.. ‘బ్రేక్ టైమ్ ఇన్ భీమ్లా నాయక్’ పేరుతో ఓ వీడియో రిలీజ్ చేశారు. పవర్ స్టార్ వైట్ అండ్ వైట్ లాల్చీ పైజామాలో యాక్షన్ హీరోలా బుల్లెట్ల వర్షం కురిపిస్తూ కనిపించారు.

Making Glimpse : పవన్ – రానా.. ఎవరూ తగ్గట్లేదుగా..

‘యోగి కమండలం కొమ్ములోంచి చెట్లకి ప్రాణ ధారలు వదుల్తాడు.. యోధుడు తుపాకి గొట్టం అంచునుంచి ప్రకృతికి వత్తాసు పలుకుతాడు.. నాయకుడు ఈ రెండింటినీ తన భుజాన మోసుకుంటూ ముందుకు కదుల్తాడు’.. అని చూపించారు. నిత్యా మీనన్, ఐశ్యర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ మూవీ 2022 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.