Allu Aravind : ఈ విషయం అందరికీ తెలియాలి.. మెగా ఫ్యామిలీతో బేధాభిప్రాయాలపై అల్లు అరవింద్ వ్యాఖ్యలు..
తాజాగా అలీతో సరదాగా షోలో అల్లు అరవింద్ దీనిపై స్పందించారు. మీకు, మెగా ఫ్యామిలీకి మధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయని ఇటీవల వార్తలు వచ్చాయి దానికి మీరేమంటారు అని అలీ అడగగా అల్లు అరవింద్ సమాధానమిస్తూ............

Allu Aravind Gives Clarity on Issues with Mega Family
Allu Aravind : అల్లు అరవింద్ ఇటీవల అలీతో సరదాగా అనే కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చారు. ఈ కార్యక్రమంలో అలీ సినిమాకి, కుటుంబానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. వాటన్నిటికీ అల్లు అరవింద్ సమాధానాలు ఇచ్చారు. ఇటీవల కొన్ని రోజుల క్రితం మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయని, అందుకే ఈ రెండు ఫ్యామిలీలు కలవట్లేదని వార్తలు వచ్చాయి.
తాజాగా అలీతో సరదాగా షోలో అల్లు అరవింద్ దీనిపై స్పందించారు. మీకు, మెగా ఫ్యామిలీకి మధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయని ఇటీవల వార్తలు వచ్చాయి దానికి మీరేమంటారు అని అలీ అడగగా అల్లు అరవింద్ సమాధానమిస్తూ.. ”సమాజంలో అలా అనుకోవడం సహజమే. కొంతమంది వాళ్ళ ఇష్టమొచ్చినట్టు వార్తలు రాస్తారు. నేను, చిరంజీవి కేవలం బావ బామ్మర్దులం మాత్రమే కాదు, మేమిద్దరం మంచి స్నేహితులం. మేమిద్దరం కలిసే ఎదిగాం. మా కుటుంబం నుంచి ఎక్కువమంది సినీ పరిశ్రమలో ఉన్నారు కాబట్టి అందరిలోనూ పోటీ తత్వం ఉంటుంది. అంతమాత్రాన మా మధ్య విబేధాలు ఏమి లేవు.”
Krithi Shetty : మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చిన బేబమ్మ.. పాన్ ఇండియా సినిమాతో రాబోతుంది..
”ఇలాంటివి రాసేవాళ్ళు, ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మేమంతా ఒక్కటే. మేమంతా ఒకటే మాట మీద ఉంటాం. ఈ విషయం అందరికి తెలియాలి. సంక్రాంతి, దసరా, దీపావళి.. ఇలా పెద్ద పండుగలు ఏమొచ్చినా మేము చిరంజీవి ఇంటికి, లేదా వాళ్ళు మా ఇంటికి వస్తూ ఉంటారు. ఇవన్నీ తెలియాలనే, ఇలాంటి వార్తలు రాకూడదనే ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు” అని తెలిపారు.