AHA 2.0 Version: ఆహా 2.Oలో రాబోయే కంటెంట్ వేరు.. ప్రతీ ఒక్కరికీ నచ్చుతుంది -అల్లు అరవింద్
హైదరాబాద్ నోవాటెల్‌లో అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా ఆహా 2.0 కార్యక్రమం గ్రాండ్‌గా జరుగుతుంది.

Allu Aravind
AHA 2.0 Version: హైదరాబాద్ నోవాటెల్‌లో అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా ఆహా 2.0 కార్యక్రమం గ్రాండ్‌గా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రెజెంట్స్ అహా 2.0 అని పేరు పెట్టారు. సరికొత్త ఫీచర్స్‌తో ఆహా 2.0 యాప్ రాబోతున్నట్లుగా ప్రకటించారు. ఆహా 2.0కి లక్ష్మీ మంచు యాంకరింగ్ చేస్తుండగా.. ఆహా 2.0 లోగోను అల్లు అరవింద్, రామూ రావు జూపల్లి లాంఛ్ చేశారు.
ఈ సంధర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఆహా ప్రారంభించేటప్పుడు ఎన్నో అనుమానాలు వచ్చాయని, కొత్త పని చేస్తున్నాము రిజల్ట్ ఎలా వుంటుందో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. నాకు సపోర్ట్‌గా నిలిచిన జూపల్లి ఫ్యామిలీ.. నా విజన్‌ని సపోర్ట్ చేస్తూ దైర్యాన్ని ఇచ్చారని అన్నారు.
తెలుగువారు వారి సత్తాచూపి మమ్మలని 2మిలియన్ సబ్‌స్క్రైబర్‌లతో ఒకనెలతో నిలబెట్టబోతున్నారు. తెలుగు వాళ్లు ఎంటర్‌టైన్‌మెంట్‌ని అదరించినట్టు ఏ రాష్ట్రంలోనూ ఆదరించరు అని అల్లు అరవింద్. పోయిన సంవత్సరం దీపావళికి ప్రేక్షకులకు ప్రామిస్ చేసిన అన్నీ విషయాలను డెలివరీ చేశాము.
ఆహాలో ఇప్పటివరకు చూసిన కంటెంట్ వేరు ఇప్పుడు 2.oలో రాబోయే కంటెంట్ వేరు.. కచ్చితంగా ప్రతీ ఒక్కరికీ నచ్చుతుంది. ఆహా 2.Oలో సుపీరియర్ వెబ్ సిరీస్, సుపీరియర్ ఫిల్మ్స్ రాబోతున్నాయని అన్నారు అల్లు అరవింద్.