Allu Arjun : ప్రభుత్వం కోసం అల్లు అర్జున్ కూడా ఆ పని చేయాల్సిందే.. పుష్ప 2కి కలెక్షన్స్ రావాలంటే తప్పదు మరి..
ఆల్రెడీ పుష్ప 2 సినిమాకు టికెట్ రేట్లు పెరుగుతాయని వార్తలు వస్తున్నాయి.

Allu Arju Must Do a Awareness Video for Government before Pushpa 2 Release
Allu Arjun : ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సినిమా వాళ్లకు ఓ కండిషన్ పెట్టిన సంగతి తెలిసిందే. పెద్ద సినిమాలు తమ సినిమాలకు టికెట్ రేట్లు పెంచాలన్నా, తమ సినిమాకు ప్రత్యేక అనుమతులు కావాలన్నా ఆ సినిమాలోని మెయిన్ స్టార్స్ తో ప్రజల్లో చైతన్యం కలిగించేలా డ్రగ్స్ కు వ్యతిరేకంగా యాంటీ డ్రగ్స్ వీడియో ఒకటి చేసి ఇవ్వాలి అని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
దీంతో ఆ ప్రకటన తర్వాత వచ్చిన భారీ సినిమాలు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఆ సినిమాల్లోని స్టార్స్ యాంటీ డ్రగ్స్ మీద వీడియోలు చేసిచ్చారు. ఇటీవల ఎన్టీఆర్ కూడా దేవర కోసం డ్రగ్స్ కు వ్యతిరేకంగా వీడియో చేసారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఓ వీడియో చేయాల్సిందే అని తెలుస్తుంది. పుష్ప 2 సినిమాకు కచ్చితంగా టికెట్ రేట్లు పెంచుతారు. భారీ కలెక్షన్స్ రావాలంటే భారీగా టికెట్ రేట్లు పెంచడం ఇప్పుడు ఆనవాయితీగా మారింది.
ఆల్రెడీ పుష్ప 2 సినిమాకు టికెట్ రేట్లు పెరుగుతాయని వార్తలు వస్తున్నాయి. అలాగే హైదరాబాద్ లో పుష్ప 2 భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పర్మిషన్ కూడా కావాలి కాబట్టి అల్లు అర్జున్ కచ్చితంగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరిచేలా వీడియో చేయాల్సిందే. మరి బన్నీ తెలంగాణ ప్రభుత్వం కోసం యాంటీ డ్రగ్స్ వీడియో ఎప్పుడు చేసి రిలీజ్ చేస్తారో చూడాలి. ఇక పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అవుతుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మూవీ యూనిట్ వరుస ప్రమోషనల్ ఈవెంట్స్ తో బిజీగా ఉంది.