బన్నీ స్టెప్స్ పాన్ ఇండియా లెవల్లో వైరల్ -శిల్పాశెట్టి బుట్టబొమ్మ స్టెప్ చూశారా!
‘అల.. వైకుంఠపురములో’.. ‘బుట్టబొమ్మ’ పాటకు స్టెప్స్ వేసిన బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి..

‘అల.. వైకుంఠపురములో’.. ‘బుట్టబొమ్మ’ పాటకు స్టెప్స్ వేసిన బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ ఫిలిం.. ‘అల.. వైకుంఠపురములో’.. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓవర్సీస్‌లో సత్తా చాటి, తెలుగు నాట నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో పాటలు, వాటిలో బన్నీ వేసిన స్టెప్స్ అదిరిపోయాయి. ‘బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టూకుంటివే’.. అంటూ సాగే మెలోడీ సాంగ్ క్లాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.
ముఖ్యంగా బన్నీ ఈ పాటలో వేసిన స్టెప్స్‌ను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా అనుసరించడం విశేషం. థమన్ తనదైన శైలిలో సంగీతం అందించిన ఈ పాటకి రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ రాయగా.. అర్మాన్ మాలిక్ ఆలపించాడు. ఇప్పుడు ఈ సాంగ్ టిక్ టాక్‌లో మరింత ఫేమస్ అయ్యింది. తమిళనాడు, కేరళ, బెంగాలీ భాషల్లో ఈ సాంగ్‌ను టిక్ టాక్ చేశారు.
తాజాగా బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ శిల్పా శెట్టి కూడా ఈ సాంగ్‌ను టిక్ టాక్ చేసి చేసింది. ‘బుట్టబొమ్మ’ పాటకు శిల్పా శెట్టి బ్యూటిఫుల్ మూమెంట్స్ వేసింది. త్రివిక్రమ్ ట్విట్టర్‌లో ఈ వీడియో షేర్ చేస్తూ.. థమన్‌కు థ్యాంక్స్ తెలిపారు. ఇప్పుడు అల్లు అర్జున్ డాన్స్ స్టెప్స్‌కు పాన్ ఇండియాలో భారీగా క్రేజ్ వచ్చింది. ‘బుట్టబొమ్మ’ సాంగ్‌కి ఒక్క టిక్ టాక్‌లోనే దాదాపు 4.6 మిలియన్ వ్యూస్ రావడం విశేషం.
@MusicThaman Sir, Look At The Craze For #ButtaBomma .. Phenomenal What You’ve Done Thaman Garu ..https://t.co/8eIXfHE2LI
— Trivikram .. (@Trivikram_Fans) February 8, 2020