శివ కళ్లల్లో సంతోషం.. బన్నీకి నెటిజన్ల ప్రశంసలు..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన మంచి పనికి నెటిజన్ల నుండి భారీగా ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా బన్నీ తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ బర్త్‌డేను ఘనంగా నిర్వహించి తన పెద్ద మనసు చాటుకున్నాడు. తన దగ్గర పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేసే శివ అనే కుర్రాడి పుట్టినరోజుని బన్నీ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశాడు.
అతని కోసం తన ఇంట్లోనే కేక్‌ను తయారు చేయించడం విశేషం. కొడుకు అయాన్‌తో కలిసి దగ్గరుండి శివతో కేక్ కట్ చేయించాడు స్టైలిష్ స్టార్. బన్నీ చేసిన Special Arrangements చూసి శివ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. షార్ట్‌తో కొత్త సినిమా కోసం తయారవుతున్న న్యూ లుక్‌లో బన్నీ బాగున్నాడు.
ఇటీవల తన పర్సనల్ బాడీగార్డు పుట్టినరోజును కూడా దగ్గరుండి సెలబ్రేట్ చేసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న ‘పుష్ప’ చిత్రం కొత్త షెడ్యల్ త్వరలో స్టార్ట్ కానుంది. బన్నీ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంటోంది.