Allu Arjun : భార్య బర్త్‌డేని లండన్‌లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన బన్నీ.. గులాబీల మధ్య..

లండన్ లోనే తన భార్యతో కేక్ కట్ చేయించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు బన్నీ. స్నేహతో బన్నీ కేక్ కట్ చేయిస్తున్న ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది స్నేహ.

Allu Arjun : భార్య బర్త్‌డేని లండన్‌లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన బన్నీ.. గులాబీల మధ్య..

Allu Arjun Celebrates his wife Birthday in London Photos goes Viral

Updated On : September 30, 2023 / 10:20 AM IST

Allu Arjun Wife : నిన్న సెప్టెంబర్ 29న అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి బర్త్ డే కావడంతో భార్య పుట్టిన రోజుని గ్రాండ్ గా లండన్ లో సెలబ్రేట్ చేశాడు బన్నీ. ఇటీవల భార్యతో కలిసి లండన్ కి వెకేషన్ కి వెళ్ళాడు బన్నీ. నిన్న తన భార్యకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పలు పోస్టులు పెట్టాడు.

Allu Arjun Celebrates his wife Birthday in London Photos goes Viral

అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో భార్యతో కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్ చేసి హ్యాపీ బర్త్‌డే మై క్యూటీ, నా లైఫ్ కి నువ్వే వెలుగువి అన్నట్టు పోస్ట్ చేశాడు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. అలాగే ఫుల్ గా గులాబీలతో నిండి పోయి ఉన్న ఇక బోర్డు మధ్యలో అద్దం ఉండేలా చేయించి తన భార్యతో కలిసి ఓ సెల్ఫీ వీడియో కూడా తీసి పోస్ట్ చేశాడు బన్నీ. లండన్ లోనే తన భార్యతో కేక్ కట్ చేయించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు బన్నీ. స్నేహతో బన్నీ కేక్ కట్ చేయిస్తున్న ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది స్నేహ.

sneha reddy

Also Read : Allu Arjun : బన్నీ భార్యకు పుట్టిన రోజుకి గిఫ్ట్ గా.. క్రిష్ – అల్లు అర్జున్ యాడ్ రిలీజ్

అల్లు అర్జున్, స్నేహ ఇలా పలు ఫోటోలు షేర్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి. అభిమానులు, పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు స్నేహ రెడ్డికి సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Allu Arjun Celebrates his wife Birthday in London Photos goes Viral