‘అన్నా నమస్తే’.. కార్తికేయ ఫంక్షన్‌కి అతిథిగా అల్లు అర్జున్..

‘అన్నా నమస్తే’.. కార్తికేయ ఫంక్షన్‌కి అతిథిగా అల్లు అర్జున్..

Updated On : March 2, 2021 / 1:17 PM IST

Allu Arjun Chief Guest: లాక్‌డౌన్ తర్వాత సినిమా పరిశ్రమ ఫుల్ బిజీ అయిపోయింది.. షూటింగ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, రిలీజులు, సక్సెస్ మీట్లతో క్షణం తీరికలేకుండా అందరూ ఉరుకులు పరుగులతో రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. ‘ఉప్పెన’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ సెలబ్రేషన్స్‌కి మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అతిథులుగా హాజరయ్యారు. సందీప్ కిషన్ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ ప్రీ రిలీజ్ కార్యక్రమానికి ఎనర్జిటిక్ స్టార్ రామ్ గెస్ట్‌గా వచ్చాడు..

కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా.. అల్లు అరవింద్ సమర్పణలో, జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’.. కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అవుతున్నారు.

Chaavu Kaburu Challaga

మార్చి 9న హైదరాబాద్, ఫిలింనగర్ జెఆర్‌సి కన్వెన్షన్‌లో సాయంత్రం 5:30 నుండి ‘చావు కబురు చల్లగా’ ప్రీ రిలీజ్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ సినిమాలో బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది. మార్చి 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Chaavu Kaburu Challaga