Allu Arha : అల్లు అర్హ చేసిన ఒక క్యూట్ పని.. నెట్టింట వైరల్!
శాకుంతలం సినిమాలో నటించిన అల్లు అర్హ.. రీసెంట్ గా చేసిన ఒక పని నెట్టింట వైరల్ అవుతుంది. అది చూసిన నెటిజెన్లు లైక్ ఫాదర్ లైక్ డాటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Allu Arjun daughter Allu Arha crazy video gone viral
Allu Arha : అల్లు అర్జున్ (Allu Arjun) గారాలపట్టి అల్లు అర్హ గురించి టాలీవుడ్ ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ కి అర్హ కంటే ముందు అయాన్ (Ayaan) అనే కొడుకు కూడా ఉన్నాడు. అయితే టాలీవుడ్ లో అయాన్ కంటే అర్హకే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు తన అన్న కంటే ముందే వెండితెర అరగేంట్రం కూడా చేసేసింది అర్హ. ఇటీవల సమంత మెయిన్ లీడ్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చిన శాకుంతలం (Shaakuntalam) సినిమాలో భరతుడు పాత్రలో నటించింది.
Pushpa 2 : 100 మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ ని షేక్ చేస్తున్న పుష్ప రాజ్..
తన ముద్దు ముద్దు మాటలతో, స్పష్టమైన డైలాగ్ డెలివరీ అండ్ యాక్టింగ్ తో ఆడియన్స్ దగ్గర మంచి మార్కులు కొట్టేసింది. ఇది ఇలా ఉంటే, తాజాగా అర్హ చేసిన ఒక పని నెటిజెన్లను అలరిస్తుంది. అల్లు అర్జున్ ని చూసేందుకు తన ఇంటికి వెళ్లిన కొంతమంది అభిమానులు.. గేట్ వద్ద నుంచి లోపల ఉన్న అర్హ అండ్ అయాన్ ని వీడియో తీశారు. వారిని గమనించిన అర్హ గేట్ దగ్గరకి వచ్చి కళ్ళతో ఒక క్రేజ్ లుక్ ఇచ్చింది. ఆ వీడియోని అభిమాని నెట్టింట పోస్ట్ చేయగా, అది చూసిన నెటిజెన్లు.. లైక్ ఫాదర్ లైక్ డాటర్ అంటూ హ్యాపీ సినిమాలోని అల్లు అర్జున్ వీడియో షేర్ చేస్తున్నారు.
Pushpa 2 : పుష్ప 2 కోసం జిమ్‌లో కసరత్తులు చేస్తున్న బన్నీ.. వీడియో వైరల్!
కాగా అల్లు అర్జున్ పుష్ప 2 (Pushpa 2) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో సినిమా పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్ విలన్ గా కనిపించబోతున్నాడు. తాజాగా ఈ సినిమాలోకి మరో విలన్ కూడా ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తుంది. జగపతి బాబు ఈ సినిమాలో నటిస్తున్నట్లు ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టాడు. అయితే అది విలన్ రోల్? లేదా సపోర్టింగ్ రోల్? అన్నది తెలియజేయలేదు.