Allu Arjun : పోలీసుల విచారణలో అల్లు అర్జున్ ఎమోషనల్.. మూడున్నర గంటల విచారణలో ఏం తిన్నాడో తెలుసా?

మూడున్నర గంటల పాటు పోలీసులు విచారణ జరిపారు.

Allu Arjun : పోలీసుల విచారణలో అల్లు అర్జున్ ఎమోషనల్.. మూడున్నర గంటల విచారణలో ఏం తిన్నాడో తెలుసా?

Allu Arjun Got Emotional in Police Investigation

Updated On : December 24, 2024 / 8:04 PM IST

Allu Arjun : సంధ్య థియేటర్ ఘటనలో నేడు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ విచారణకు హాజరయిన సంగతి తెలిసిందే. నేడు ఉదయం 11 గంటలకు విచారణకు పోలీసులు రమ్మనగా బన్నీ వెళ్లారు. మూడున్నర గంటల పాటు పోలీసులు విచారణ జరిపారు. అనంతరం అల్లు అర్జున్ ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. మళ్ళీ అవసరమైతే విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పడంతో అల్లు అర్జున్ వస్తానని చెప్పారు.

ఈ విచారణలో సంధ్య థియెటర్ ఘటన పై పోలీసులు తయారు చేసిన వీడియోను అల్లుఅర్జున్ కి చూపించారు. ఈ వీడియో చూసి అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారు. అనంతరం మూడు గంటల 35 నిమిషాల పాటు అల్లు అర్జున్ ని పోలీసులు విచారించారు. పోలీస్ ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం చెప్పారు. కొన్ని ప్రశ్నలకు మాత్రం తనకు తెలియదని సమాధానం చెప్పారు.

Also Read : RRR Behind and Beyond : పాపం RRR డాక్యుమెంటరీని ఎవ్వరూ పట్టించుకోవట్లేదుగా.. చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చూడట్లేదు..

థియేటర్ లోపల చీకటిగా ఉన్ననందున కొన్ని విషయాలు తనకు అర్ధం కాలేదు అని పలు ప్రశ్నలకు బన్నీ సమాధానం ఇచ్చారు. అలాగే తన వల్ల కొన్ని మిస్టేక్స్ జరిగినట్లు అల్లు అర్జున్ ఒప్పుకున్నాడు. ఈ పూర్తి విచారణను వీడియో రికార్డ్ చేశారు పాలీసులు. విచారణ అనంతరం మళ్ళీ విచారణకు పిలిస్తే ఎప్పుడైనా హాజరు అవుతానని అల్లు అర్జున్ తెలిపారు.

ఇక ఈ విచారణ సమయంలో అల్లు అర్జున్ మూడు సార్లు నీళ్లు తాగారు. తన వాహనంలో ఉన్న బిస్కెట్స్, డ్రై ఫ్రూట్స్ తెప్పించుకొని తిన్నారు. అలాగే టీ కూడా తాగారు అల్లు అర్జున్. ఈ విచారణలో అల్లుఅర్జున్ ని పోలీసులు 18 ప్రశ్నలు అడిగారు. త్వరలోనే మరోసారి పోలీసులు నోటీసులు ఇస్తారని సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనలో బెయిలుపై బయట ఉన్నారు.

ఇక మరోవైపు పుష్ప 2 సినిమా థియేటర్స్ లో ఇంకా మంచి కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. ఇప్పటికే 1500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది ఈ సినిమా. నేటి నుంచి హిందీ వర్షన్ లో పుష్ప 2 సినిమా 3D కూడా అందుబాటులోకి రానుంది.

Also Read : RGV : ఆర్జీవీ ఈసారి ఎలా తప్పించుకుంటాడో చూస్తాం.. ఆర్జీవిపై ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ కామెంట్స్..