RRR Behind and Beyond : పాపం RRR డాక్యుమెంటరీని ఎవ్వరూ పట్టించుకోవట్లేదుగా.. చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చూడట్లేదు..
RRR బ్యాక్ గ్రౌండ్ స్టోరీ, మేకింగ్ అంటూ ఇటీవల RRR బిహైండ్ అండ్ బియాండ్ అనే పేరుతో ఓ డాక్యుమెంటరీని రిలీజ్ చేశారు.

No one Look at Rajamouli Ram Charan NTR RRR Behind and Beyond Documentary Theatrical Release
RRR Behind and Beyond : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా వచ్చిన RRR సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆస్కార్ వరకు వెళ్లి నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు సాధించి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది RRR సినిమా. దీంతో RRR సినిమా, రాజమౌళి స్థాయి మరింత పెరిగాయి. సినిమా వచ్చి రెండేళ్లు దాటేసింది. ఇప్పటికీ ఈ సినిమా గురించి అప్పుడప్పుడు ఫ్యాన్స్ అయినా మాట్లాడుకుంటారు.
కానీ RRR బ్యాక్ గ్రౌండ్ స్టోరీ, మేకింగ్ అంటూ ఇటీవల RRR బిహైండ్ అండ్ బియాండ్ అనే పేరుతో ఓ డాక్యుమెంటరీని రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు మంచి స్పందనే వచ్చింది. అయితే ఈ RRR బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీని ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ చేయకుండా 200 రూపాయలు టికెట్ పెట్టి థియేటర్లో రిలీజ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు.
Also Read : Dil Raju : సీఎంని టాలీవుడ్ తరపున కలుస్తాం.. లైన్లోకి దిగిన దిల్ రాజు.. వివాదం ముగిసినట్టేనా?
1 గంట 40 నిముషాలు నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీని థియేటర్ కి వెళ్లి చూడటానికి ఎవరూ సుముఖం చూపించలేదు. ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ వాళ్ళ రీ రిలీజ్ సినిమాలకే థియేటర్స్ కి వెళ్లి రచ్చ చేస్తారు అలాంటిది RRR మేకింగ్ కి చెందిన డాక్యుమెంటరీ రిలీజ్ చేస్తే కనీసం థియేటర్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. పైగా ఓటీటీలో రిలీజ్ చేయాల్సిన కంటెంట్ ని థియేటర్లో ఎందుకు రిలీజ్ చేశారు అని విమర్శలు కూడా వచ్చాయి.
ఇదంతా ఒక ఎత్తైతే గత కొన్ని రోజులుగా పుష్ప 2 సినిమా హవా, అల్లు అర్జున్ వివాదంతో మీడియా, జనాలు కూడా RRR డాక్యుమెంటరీని పట్టించుకోలేదు. మూవీ యూనిట్ కూడా ప్రమోషన్స్ చేయలేదు. అసలు చరణ్, ఎన్టీఆర్ కూడా ఈ డాక్యుమెంటరీని పట్టించుకోకపోవడం ఆశ్చర్యం. దీంతో RRR బిహైండ్ అండ్ బియాండ్ థియేట్రికల్ రిలీజ్ అనేది డిజాస్టర్ లా మిగిలింది. ఆస్కార్ తెచ్చిన సినిమా డాక్యుమెంటరీని ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం.
ఇక RRR బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో డిసెంబర్ 27 నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఈ మాత్రం దానికి, వారం రోజులకు దాన్ని థియేటర్లో ఎందుకు రిలీజ్ చేసారో అని కామెంట్స్ వస్తున్నాయి. మరి థియేటర్లో ఎవరూ పట్టించుకోని RRR బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ కనీసం ఓటీటీలో అయినా చూస్తారా లేక అక్కడ కూడా లైట్ తీసుకుంటారా చూడాలి. ఆస్కార్ సాధించిన సినిమా మేకింగ్ డాక్యుమెంటరీకి ఇలాంటి పరిస్థితి రావడం శోచనీయం.
Also Read : Yash Remuneration : విలన్ పాత్ర కోసం అన్ని వందల కోట్లు.. స్టార్ హీరోలని మించే రెమ్యూనరేషన్..