Dil Raju : సీఎంని టాలీవుడ్ తరపున కలుస్తాం.. లైన్లోకి దిగిన దిల్ రాజు.. వివాదం ముగిసినట్టేనా?

తెలంగాణ FDC చైర్మన్, స్టార్ నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగారు.

Dil Raju : సీఎంని టాలీవుడ్ తరపున కలుస్తాం.. లైన్లోకి దిగిన దిల్ రాజు.. వివాదం ముగిసినట్టేనా?

Dil Raju says Tollywood will Meet CM Revanth Reddy in Allu Arjun and Theaters Issue

Updated On : December 24, 2024 / 5:17 PM IST

Dil Raju : అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఇకపై తాను సీఎంగా ఉన్నంత కాలం బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుకు పర్మిషన్ ఇవ్వను అని అన్నారు. దీంతో టాలీవుడ్ నిర్మాతలు, పెద్ద హీరోలు షాక్ అయ్యారు. దీనిపై సీఎంతో ఎవరు మాట్లాడతారా అని ఇన్ని రోజులు తర్జనభర్జన పడ్డారు. మరో వైపు అల్లు అర్జున్ కేసు మరింత జటిలం అవుతుంది.

ఈ క్రమంలో తెలంగాణ FDC చైర్మన్, స్టార్ నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగారు. గత కొన్ని రోజులుగా గేమ్ చెంజర్ ప్రమోషన్స్ లో భాగంగా అమెరికాలో ఉన్న దిల్ రాజు తిరిగివచ్చారు. రాగానే ఈ సమస్యని ముగించడానికి సిద్ధం అయ్యారు. తాజాగా కొద్దిసేపటి క్రితం దిల్ రాజు కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాలుడిని, అతని కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

Also Read : RGV : ఆర్జీవీ ఈసారి ఎలా తప్పించుకుంటాడో చూస్తాం.. ఆర్జీవిపై ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ కామెంట్స్..

దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. పుష్ప సినిమా ప్రీమియర్ సమయంలో జరిగిన సంఘటన దురదృష్టకరం. అప్పుడప్పుడు ఇలాంటివి సినిమా ఇండస్ట్రీలో చూస్తున్నాం. సినిమాకు, ప్రభుత్వంకు మధ్య బ్రిడ్జి లా ఉండాలనే నన్ను FDC చైర్మన్ గా నియమించారు. ఆల్రెడీ సీఎంగారిని కలిసి మాట్లాడటం జరిగింది. రేపు లేదా ఎల్లుండి ఇండస్ట్రీ తరపున సీఎం రేవంత్ గారిని కలుస్తాము. అల్లు అర్జున్ ని కూడా కలుస్తాను అని తెలిపారు.

అలాగే రేవతి కుటుంబానికి అన్ని విధాలుగా సినీ పరిశ్రమ నుంచి ఆదుకుంటాము. భాస్కర్ కు ఇండస్ట్రీలో పర్మినెంట్ జాబ్ ఇచ్చేలా చేస్తున్నాం. శ్రీ తేజ్ వెంటిలేటర్ తొలిగించారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు అని తెలిపారు దిల్ రాజు. దిల్ రాజు వచ్చి మాట్లాడటంతో టాలీవుడ్ లో ఒక ఆశ నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని చెప్పడంతో రేపటి మీటింగ్ పై అందరి దృష్టి ఉంది.

Also Read : Sandhya Theatre Incident : సంధ్య థియేటర్ ఘటనలో..మైత్రి మూవీ మేకర్స్ కి భారీ షాక్ ఇచ్చిన పోలీసులు..

దిల్ రాజు రంగంలోకి దిగి ఆల్రెడీ సీఎంని కలిసి మాట్లాడటం, రేపు మళ్ళీ టాలీవుడ్ పెద్దలతో వెళ్లి కలుస్తాను అని చెప్పడంతో టికెట్ పెంపు, బెనిఫిట్స్ షోల పర్మిషన్స్ గురించి మాట్లాడతారా? సీఎం ఒప్పుకుంటారా? అల్లు అర్జున్ ఇష్యూ గురించి కూడా మాట్లాడతారా? సీఎం ఏం కండిషన్స్ పెడతారు అని టాలీవుడ్ లో ప్రస్తుతం చర్చ నెలకొంది. ఇక అంతా దిల్ రాజు చేతిలోనే ఉంది అని టాలీవుడ్ భావిస్తుంది.