Allu Arjun : ఏపీ వరద భాదితులకు అల్లు అర్జున్ సాయం
వరదల వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు టాలీవుడ్ హీరోలు వరుసగా సాయం ప్రకటిస్తున్నారు. తాజాగా ఏపి వరద బాధితుల సహాయార్ధం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.....

Allu Arjun
Allu Arjun : ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, ఏర్పడిన వరదలకు రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పటికి కూడా ఇంకా వర్షాలు పడుతుండటంతో చాలా ప్రాంతాలలో ఈ వరద కష్టాలు వీడలేదు. ఈ వర్షాలు, వరదల కారణంగా పలు గ్రామాలు వరదలో మునిగిపోగా, భారీగా పంట నష్టం, పాడి పరిశ్రమ నష్టం, ఆస్తుల నష్టం కలిగింది. అంతేకాక చాలా మంది ఈ వరదల్లో మరణించారు. కొంతమంది తమ ఇండ్లను సైతం కోల్పోయారు. చాలా చోట్ల రోడ్లు దెబ్బ తిన్నాయి.
Akhanda Review: అఘోరాగా ఉగ్రరూపం.. ఊర మాస్ బాలయ్య.. ఫ్యాన్స్‌కు పూనకాలే!
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. వరదల వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు టాలీవుడ్ హీరోలు వరుసగా సాయం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, చిరంజీవిలు 25 లక్షల చొప్పున ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కి సాయం ప్రకటించారు. తాజాగా ఏపి వరద బాధితుల సహాయార్ధం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 25 లక్షల రూపాయలను ప్రకటించారు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో.. ” వరదల వల్ల బాధపడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రజలని చూసి చలించిపోయాను. వారి పునరావాస ప్రయత్నాలకు సహాయం చేయడానికి ఆంద్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కి నేను 25 లక్షల విరాళాన్ని అందిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశాడు అల్లు అర్జున్.