అల్లు అర్జున్ పిల్లల ఫ్రైడే నైట్ డ్యాన్స్ పార్టీ చూశారా!

  • Published By: sekhar ,Published On : October 24, 2020 / 11:32 AM IST
అల్లు అర్జున్ పిల్లల ఫ్రైడే నైట్ డ్యాన్స్ పార్టీ చూశారా!

Updated On : October 24, 2020 / 12:10 PM IST

Allu Arjun Kids Dance: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల కిడ్స్ అల్లు అర్హ, అయాన్ ఎంత హుషారుగా ఉంటారో తెలిసిందే. అలాగే బన్నీ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. పర్సనల్, ప్రొఫెషన్‌కు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులు, ప్రేక్షకులతో పంచుకుంటుంటాడు. అలాగే తరచుగా బన్నీ, స్నేహా తమ పిల్లలకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను కూడా తరచుగా పోస్ట్ చేస్తుంటారు.




తాజాగా ‘ఫ్రైడే నైట్ డ్యాన్స్ పార్టీ’ అంటూ పిల్లలు టీవీ చూస్తూ డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు అల్లు అర్జున్. పిల్లలు టీవీ చూస్తూ హుషారుగా స్టెప్పులేశారు. బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నాడు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కబోయే ఈ సినిమా కోసం బన్నీ కొత్త లుక్ లోకి మారిపోయాడు. ‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత బన్నీ, సుకుమార్ కలయికలో రానున్న హ్యాట్రిక్ సినిమా ఇది.
https://10tv.in/arjun-kapoor-as-hanuman-in-adipurush/

 

View this post on Instagram

 

Having a great Friday Night dance party #pennywisedance ? #mylovelybabies ?

A post shared by Allu Arjun (@alluarjunonline) on