స్టైలిష్ స్టార్ లగ్జరీ SUV వెహికల్ చూశారా!

  • Published By: sekhar ,Published On : September 3, 2020 / 08:05 PM IST
స్టైలిష్ స్టార్ లగ్జరీ SUV వెహికల్ చూశారా!

Updated On : September 3, 2020 / 8:44 PM IST

Allu Arjun Modifies his Land Rover Range Rover: సెలబ్రిటీలు వాడే లగ్జరీ కార్లు, బైకుల ధరతో పాటు వాటి ప్రత్యేకతలు ఏంటో తెలిస్తే ఆశ్చర్య పోతుంటాం. గతేడాది కొత్త ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్‌ను కొనుగోలు చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ఆ వాహనాన్ని మోడిఫై చేయించారు.Allu Arjunకంఫర్టబుల్‌గా జర్నీ చేయడానికి ఆసక్తిచూపే బన్నీకి అత్యాధునిక వసతులు కలిగిన రూ.7 కోట్ల విలువచేసే వానిటీ వ్యాన్ కూడా ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్‌కు చెందిన రేంజ్ రోవర్ వోగ్‌ ఎస్‌యూవీను రేస్‌టెక్ ఇండియా కంపెనీ మోడిఫై చేసింది.



Allu Arjun



వాహనానికి ఆల్-బ్లాక్ ట్రీట్మెంట్‌తో పాటు ఫ్రంట్ గ్రిల్, బ్రాండ్ లోగోలు మరియు క్రోమ్ ఫినిష్‌లో ఉన్న వాహనంలోని మిగతా పార్ట్స్ అన్నీ బ్లాక్ కలర్‌లో కనిపిస్తుండడంతో ఎస్‌యూవీకి రాయల్ లుక్ వచ్చింది.

Allu Arjun



ఇది ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్, దీని ధర రూ .2 కోట్లకు దగ్గరగా ఉంటుంది. ఎక్స్-షోరూమ్ మరియు అదనపు ఫీచర్లతో కలుపుకుంటే ఆన్-రోడ్ రేటు మరికొన్ని లక్షలు ఎక్కువ అవుతుంది. ఇండియా మార్కెట్‌లో పలు మోడల్స్ రేంజ్ రోవర్ ఇంజన్లు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది బాలీవుడ్ ప్రముఖులకిది ఫేవరెట్ ఎస్‌యూవీ.Allu Arjunసినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది సంక్రాంతికి ‘అల…వైకుంఠపురములో’.. చిత్రంతో నాన్- బాహుబలి రికార్డ్ క్రియేట్ చేసిన బన్నీ.. సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ మూవీ చేయనున్నారు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

Allu Arjun