Allu Arjun: బన్నీ కొత్త యాడ్.. మొన్న బస్ ఎక్కమని.. నేడు తినమని!

పుష్ప బ్లాక్ బస్టర్ సినిమాతో సౌత్ టూ నార్త్ తగ్గేదేలే అంటూ పాన్ ఇండియా ఐకాన్ స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతగా..

Allu Arjun: బన్నీ కొత్త యాడ్.. మొన్న బస్ ఎక్కమని.. నేడు తినమని!

Allu Arjun

Updated On : February 4, 2022 / 4:47 PM IST

Allu Arjun: పుష్ప బ్లాక్ బస్టర్ సినిమాతో సౌత్ టూ నార్త్ తగ్గేదేలే అంటూ పాన్ ఇండియా ఐకాన్ స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతగా ప్రకటనలో కూడా తగ్గేదేలే అంటూ రెచ్చిపోతున్నాడు. ఫ్రూటీ, రాపిడోతో పాటు రెడ్ బస్ కి కూడా బన్నీ బ్రాండ్ అంబాసిడర్ అన్న సంగతి తెల్సిందే. తాజాగా ఇప్పుడు బన్నీ ఖాతాలో జొమాటో కూడా వచ్చి చేరింది.

Aadavaallu Meeku Joharlu: లక్కీ గర్ల్ రష్మిక.. శర్వాకి లక్ కలిసి వస్తుందా?

జొమాటోకి సంబంధించి అల్లు అర్జున్ ప్రకటన నెట్టింట వైరల్ గా మారింది. ఈ యాడ్ లో బన్నీతో పాటు నటుడు సుబ్బరాజు కూడా కనిపించగా.. షూటింగ్ సీన్ తో కొత్తగా ప్రకటన కట్ చేశారు. ఫైట్ సీన్ లో బన్నీ సుబ్బరాజుని గాల్లోకి లేపితే.. ఆ షాట్ స్లో మోషన్ లో ఉండగా సుబ్బరాజు.. బన్నీ కిందకి దింపేవా గోంగూర మటన్ తినాలని ఉందనడం.. దానికి బన్నీ సౌత్ సినిమా కదా ఎక్కువసేపు ఎగరాలి అంటూ సాగే సంభాషణ నవ్వులు పూయిస్తుంది.

Tees Maar Khan: పాప ఆగవే.. ఆగి చూడవే.. టీజ్ చేస్తున్న ఆది!

ఎప్పుడు ఏం కావాలన్నా జొమాటో ఉందిగా అంటూ బన్నీ చెప్తాడు. ఏం కావాలన్నా.. ఎప్పుడు కావాలన్నా సూపర్ ఫాస్ట్ గా జొమాటో అందిస్తుంది.. మనసు కోరితే తగ్గేదేలే అంటూ పుష్ప స్టైల్లో బన్నీ చెప్పిన డైలాగ్ తో యాడ్ ముగుస్తోంది. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పుష్ప లుక్ నుండి బయటకి వచ్చేసిన బన్నీ ఇప్పుడు కొత్తగా కనిపించడం విశేషం.