Allu Arjun: కూతురుతో కలిసి నైట్ రైడ్‌కు వెళ్లిన అల్లు అర్జున్.. నెట్టింట వీడియో వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తనదైన మార్క్‌తో రూపొందిస్తుండగా, ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు. తాజాగా, తన కూతురు అల్లు అర్హా కోరిక మేరకు బన్నీ ఆమెను కారులో తీసుకుని నైట్ రైడ్‌కు వెళ్లాడట.

Allu Arjun Night Ride With Daughter
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తనదైన మార్క్‌తో రూపొందిస్తుండగా, ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు. అయితే సినిమా షూటింగ్ లేనప్పుడు బన్నీ తన ఫ్యామిలీకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాడని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తన గారాల కూతురు అల్లు అర్హాతో బన్నీ చేసే అల్లరికి సంబంధించి పలు ఫోటోలు, వీడియోలు నెట్టింట మనం చూశాం.
Allu Arjun : పుష్ప ఎఫెక్ట్ తగ్గేదేలే.. ఇండియన్ అఫ్ ది ఇయర్.. అల్లు అర్జున్ కి మరో అవార్డు..
అయితే తాజాగా, తన కూతురు అల్లు అర్హా కోరిక మేరకు బన్నీ ఆమెను కారులో తీసుకుని నైట్ రైడ్‌కు వెళ్లాడట. తన కూతురు కోరిన వెంటనే ఇలా కారేసుకుని లాంగ్ డ్రైవ్, అది కూడా నైట్ టైమ్‌లో వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక వీరిద్దరు కలిసి కారులోనే రాత్రివేళ ఫుడ్ తింటున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యింది. కూతురితో కలిసి తనకు ఇష్టమైన ఫుడ్‌ను తింటున్న బన్నీని చూసి తండ్రీకూతుళ్లు అంటే ఇలాగే ఉంటారు అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
Allu Arjun: అల్లు కుటుంబానికి అవార్డుల పంట.. క్లీన్ స్వీప్ చేశామంటున్న అల్లు అర్జున్!
కాగా, ఈ ఫోటోను అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఇది వైరల్‌గా మారింది. ఇక బన్నీ నటిస్తున్న పుష్ప-2 సినిమాకు సంబంధించి త్వరలోనే ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు సుకుమార్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారట.